తెలంగాణా సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వారు సి.ఎం రిలీఫ్ ఫండ్ కొరకు తెలంగాణా స్టార్స్ వర్సెస్ ఆంధ్ర స్టార్స్ తో ఈ క్రికెట్ మ్యాచ్ ను నిర్వహించారు. ఆగస్ట్ 23, 2015 న ఎల్.బి. స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో తెలంగాణా స్టార్స్ వారు విజేతలుగా నిలిచారు. వీరిని ప్రోత్సహించడానికి అమ్మ ఆర్ట్ ప్రొడక్షన్స్ సంస్థ వారు మొమెంటోస్ ను అందజేశారు. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్ లోని విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో..
ఎమ్.ఎస్.నాగరాజు మాట్లాడుతూ.. ఆగస్ట్ 23న ఎల్.బి. స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ కు 14700 మంది వీక్షించడానికి వచ్చారు. మా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఆకాష్ కెప్టెన్ గా వ్యవహరించిన తెలంగాణా స్టార్స్ టీం ఈ మ్యాచ్ లో నెగ్గారు. వారిని ప్రోత్సహించడానికి అమ్మ ఆర్ట్ ప్రొడక్షన్స్ వారు మొమెంటోస్ ను అందజేయడం అభినందించాల్సిన విషయం. ఇలాంటి మ్యాచ్ లు మరిన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నాం. నవంబర్ లో చెన్నై హీరోస్ వర్సెస్ బొంబాయి హీరోస్ మధ్య క్రికెట్ మ్యాచ్ నిర్వహించనున్నాం. పది రోజుల్లో ఈ విషయంపై అధికార ప్రకటన చేయనున్నాం. అలానే నవంబర్ మొదటి వారంలో టీకా ఆధ్వర్యంలో ఓ సినిమాను ప్రారంభించనున్నాం.. అని చెప్పారు.
ఆకాష్ మాట్లాడుతూ.. అతి తక్కువ సమయంలో మ్యాచ్ జరగడానికి సపోర్ట్ చేసిన నాగరాజు గారికి ధన్యవాదాలు. చెన్నై హీరోస్ వర్సెస్ తెలంగాణా స్టార్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కొన్ని కారణాల వలన తెలంగాణా స్టార్స్ వర్సెస్ ఆంధ్ర స్టార్స్ మధ్యన నిర్వహించాం. కాని నవంబర్ లో మాత్రం బొంబాయి స్టార్స్ వర్సెస్ చెన్నై స్టార్స్ తో మ్యాచ్ జరపడానికి ప్లాన్ చేస్తున్నాం.. అని చెప్పారు.