Advertisementt

రెండు రాష్ట్రాలు ఒక్కటవుతాయంటున్న చంద్రబాబు..!!

Sat 25th Jul 2015 10:53 AM
kcr,telecom operator,tapping,telangana  రెండు రాష్ట్రాలు ఒక్కటవుతాయంటున్న చంద్రబాబు..!!
రెండు రాష్ట్రాలు ఒక్కటవుతాయంటున్న చంద్రబాబు..!!
Advertisement
Ads by CJ

తెలుగు రాష్ట్రాల ప్రజలు మళ్లీ ఒక్కటవుతారా..? విడిపోయిన రెండు రాష్ట్రాలు కలిసి మళ్లీ ఆంధ్రప్రదేవ్‌ ఒక్క రాష్ట్రంగా ఏర్పడుతుందా..? ఒకప్పుడు విడిపోవడానికి ఉద్యమాలు చేసిన తెలంగాణ ప్రజలు మళ్లీ కలిసొద్దామంటూ విజ్ఞప్తి చేస్తారా..?. భవిష్యత్తులో ఇవన్ని జరుగుతాయో లేదో కాని.. చంద్రబాబు  మాటలు మాత్రం ఈ దిశగా మన ఆలోచనలను పరుగులు పెట్టిస్తున్నాయి.
తెలుగు సంస్కృతి, భాషపై జరిగిన ఓ సదస్సులో చంద్రబాబు చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యానాలు చేశారు. గతంలో అనేకసార్లు తెలుగు ప్రజలు విడివడి మళ్లీ ఒక్కటయ్యారని, మళ్లీ తెలుగు ప్రజలు కలిసిపోతారంటూ బాబు చేసిన వ్యాఖ్యలు సదస్సుకు హాజరైన వారిని ఆలోచింపజేశాయి. అంతేకాకుండా తెలుగు భాషకు, సంస్కృతికి 3 వేల సంవత్సరాల గొప్ప చరిత్ర ఉందంటూ బాబు కొనియాడారు. ఇక గోదావరి పుష్కరాల గురించి బాబు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 4.30 కోట్ల మంది పుష్కర స్నానాలు చేశారని, తన హయాంలో పుష్కరాలు జరగడం అదృష్టంగా భావిస్తున్నానని బాబు పేర్కొన్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ