రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు టెలికాం ఆపరేటర్లకు తలనొప్పిగా మారింది. ఓటుకు కోట్లు కేసులో టీడీపీని ఇరికించడానికి తెలంగా ణ ప్రభుత్వం కొన్ని ఫోన్లను ట్యాప్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని బయటకు వెల్లడించవద్దని, అలా చేసే చర్యలు తప్పవని తెలంగాణ సర్కారు ఆయా టెలికాం ఆపరేటర్లను హెచ్చరించింది. మరోవైపు తమ ఫోన్లను తెలంగాణ సర్కారు ట్యాప్ చేయించ ద్దంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. దీనిపై స్పష్టత నివ్వాలని టెలికాం ఆపరేటర్లను సుప్రీం కోర్టు ఆదేశిస్తే.. ఈ విషయాన్ని బహిరంగపరిస్తే చర్యలు తీసుకుంటామంటూ తెలంగాణ సర్కారు చేసిన హెచ్చరిక గురించి టెలికాం ఆపరేటర్లు సుప్రీం కోర్టుకు ఏకరువు పెట్టుకున్నారు. ఇక సుప్రీం కోర్టు అభయంతో ట్యాపింగ్‌కు సంబంధించిన సమాచారాన్ని బయటకు వెళ్లడించడానికి మూడు టెలికాం ఆపరేటింగ్ కంపెనీలు ఓకే చెప్పాయి.
తాము ఫోన్ల ట్యాపింగ్‌కు సహకరించామని ఎయిర్‌టెల్, ఐడియా, రిలయన్స్ సంస్థలు సుప్రీంకోర్టుకు తెలియజేశాయి. ఇండియన్ టెలిగ్రాఫిక్ చట్ట-సెక్షన్ 5 కింద తెలంగాణ సర్కారు ఆదేశాల మేరకు తాము ట్యాపింగ్‌కు సహకరించామని, అయితే కంటెంట్‌తో తమకు సంబంధం లేదని స్పష్టం చేశాయి. ఇక ఈ ట్యాపింగ్ జరిగిన సమయంలోనే ఏసీబీ కేసు నమోదు కావడంతో కంటెంట్.. ఓటుకు కోట్లు కేసుకు సంబంధించిదనేది స్పష్టమవుతోంది. ఇక ఓటుకు కోట్లు కేసుతో టీడీపీని ఇరుకునపెట్టాలనుకున్న తెలంగాణ సర్కారుకు కూడా ఇప్పుడు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.