Advertisementt

బాబును కేసీఆర్‌ కలుస్తారో..? లేదో..?

Tue 30th Jun 2015 05:19 AM
kcr,fever,president,rajbhavan  బాబును కేసీఆర్‌ కలుస్తారో..? లేదో..?
బాబును కేసీఆర్‌ కలుస్తారో..? లేదో..?
Advertisement
Ads by CJ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంగళవారం జ్వరం వచ్చినట్లు సమాచారం. దీంతో మంగళవారం నిర్ణయించిన ముఖ్యమంత్రి అప్పాయింట్‌మెంట్స్‌ను సీఎమ్‌ఓ కార్యాలయం రద్దు చేసింది. ప్రస్తుతం కేసీఆర్‌ ఆరోగ్యం నిలకడగానే ఉందని, విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం. కాగా ఈ రోజు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ రాష్ట్రపతి గౌరవార్థం ప్రత్యేక విందును ఇస్తున్నారు. మంగళవారం సాయంత్రం జరగనున్న ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ హాజరవుతారా లేదా అన్నది తెలియకుండా ఉంది. సాయంత్రంలోపు కేసీఆర్‌ ఆరోగ్యం మెరుగుపడితే ఆయన తప్పకుండా విందుకు హాజరవుతారని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు కూడా హాజరవుతున్నారు. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు ఎదురెదురు పడితే ఎలా స్పందిస్తారోనని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ భేటీ సీఎం కేసీఆర్‌ ఆరోగ్యంపైనే ఆధారపడి ఉంటుంది.
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ