రేవంత్‌రెడ్డి కేసు మరో మలుపుతిరిగింది. ఫోరెనిక్స్ ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్టులను తమకు తెలియకుండా ఎవరికీ అందించవద్దని ఎఫ్‌ఎస్‌ఎల్ ఏసీబీ కోర్టును కోరింది. అయితే ఈ రిపోర్టులు కావాలనే కోర్టు ద్వారా ఏసీబీ ఎఫ్‌ఎస్‌ఎల్‌ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అలాంటిది ఏసీబీకి కూడా తమకు తెలియకుండా నివేదిక ఇవ్వవద్దని ఎఫ్‌ఎస్‌ఎల్ ఎందుకు కోరిందనేది ఇప్పుడు అర్థంకాకుండా ఉంది.
ఓటుకు నోటు కేసును ప్రస్తుతం ఏసీబీ కోర్టు విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన వీడియో, ఆడియో ఫుటేజులు నిజమైనవని నిరార్ధించడానికి ఏసీబీ కోర్టు ద్వారా ఎఫ్‌ఎస్‌ఎల్‌ను ఆశ్రయించింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే నివేదికను ఎఫ్‌ఎస్‌ఎల్ కోర్టుకు నివేదికను సమర్పించింది. అయితే తమకు సమాచారం ఇవ్వకుండా ఈ నివేదికను ఎవరికీ ఇవ్వొద్దని కోర్టును కోరింది. మరోవైపు ఈ నివేదిక కోసం ఎదురుచూస్తున్న ఏసీబీకి ఇది సమస్య తెచ్చిపెట్టింది. ఇప్పుడు మళ్లీ ఈ నివేదిక కోసం ఎఫ్‌ఎస్‌ఎల్‌ను ఏసీబీ ఆశ్రయించాల్సి ఉంటుంది. ఈ నివేదిక రాగానే బాబుకు నోటీసులు ఇవ్వాలనే యోచనలో ఉన్న ఏసీబీకి ఇది మింగుడుపడటం లేదు. దీంతో ఈ కేసు దర్యాప్తు కొంతనెమ్మదించే అవకాశాలు కనిపిస్తున్నాయి.