స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడిన ఫోన్ సంభాషణలు మీడియాకు విడుదల కాగానే అటు టీఆర్‌ఎస్, వైసీపీలు పండగ చేసుకుంటుండగా.. టీడీపీ వర్గాలు మాత్రం ఆందోళనలో మునిగిపోయాయి. ఇక ఆదివారం రాత్రి కేసీఆర్ గవర్నర్‌ను కలుసుకోవడంతో చంద్రబాబు అరెస్టుకు అవకాశాలున్నాయంటూ మీడియా కోడై కూసింది. ఫోన్ సంభాషణల్లో చంద్రబాబు వాయిస్ క్లియర్‌గా రికార్డు అయ్యిందని, ఆయన ఇరుక్కుపోయినట్టేనని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే న్యాయ నిపుణుల మాట మాత్రం వేరేలా ఉంది.
స్టీఫెన్‌సన్‌తో ఫోన్ సంభాషణల్లో చంద్రబాబు ఎక్కడ కూడా డబ్బు అనే మాట ఎత్తలేదు. అంతేకాకుండా ఆయన తమ పార్టీలోకి రావాలంటూ కూడా చెప్పలేదు. ఆ సంభాషణల్లో పార్టీ మారడటంకాని, వలసలను ప్రోత్సహించినట్లు కాని ఎక్కడా మాట్లాడలేదు. కేవలం కలిసి పనిచేద్దాం అన్న మాటలు మాత్రమే ఉన్నాయి. ఈ సంభాషణతో చంద్రబాబు ముడుపుల ఆఫర్ ఇచ్చినట్లు చెప్పడం కష్టం. ఒకవేళ రేవంత్ కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇస్తే అప్పుడు ఏసీబీకి పక్కా ఆధారాలు లభించినట్లు అవుతోంది. మరి ఇది జరిగే అవకాశం ఉందా అనేది చెప్పలేం.