Advertisementt

నాట్స్ సభకు వెళ్లాలా! వద్దా! బాలకృష్ణ, పవన్ సందిగ్ధం!

Tue 28th Apr 2015 01:31 PM
  నాట్స్ సభకు వెళ్లాలా! వద్దా! బాలకృష్ణ, పవన్ సందిగ్ధం!
నాట్స్ సభకు వెళ్లాలా! వద్దా! బాలకృష్ణ, పవన్ సందిగ్ధం!
Advertisement
Ads by CJ

నాట్స్ నిధుల గోల్‌మాల్

కేసులో ఇరుక్కున్న నాట్స్ పెద్దలు

చందాలు ఇచ్చినవారిపై ఐఆర్ఎస్ ఆరా

 ఉత్తర అమెరికాలోని తెలుగువారి సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడుతూ ఇక్కడి తెలుగువారిని సామాజిక, విద్యా రంగాల్లో నిష్ణాతులను చేసేందుకు ఏర్పాటైన నాట్స్ సొసైటీ లక్ష్యాన్ని మరిచి పక్కదారులు పడుతోంది. ఈ సొసైటీలోని బోర్డు డైరెక్టర్లు డబ్బుల కోసం ఒకరిపై మరొకరు ఆరోపణలు గుప్పిస్తూ కోర్టులకెక్కుతున్నారు. ముఖ్యంగా వీరయ్య చుందు(బోర్డు డైరెక్టర్) ‘వర్సెస్’ మధు కొర్రపాటి(ఛైర్మన్)ల మధ్య లీగల్ వార్ జరుగుతోంది. కొర్రపాటి ఛైర్మన్‌గా తన న్యాయబద్దమైన బాధ్యతలను, సంస్థ నిబంధనలను ఉల్లంఘించి వ్యవహరించారన్నది వీరయ్య ప్రధాన ఆరోపణ.  

స్వచ్చంధ సంస్థల ద్వారా ఈ సొసైటీ సేకరించిన విరాళాలు గుట్టుచప్పుడు కాకుండా తరలిపోవడంపై వీళ్ల మధ్య పోరు తారాస్థాయికి చేరింది. ఒకరిపై మరొకరు కేసులు వేసుకుంటూ తెలుగువారి గౌరవ ప్రతిష్టలను విదేశాల్లోనూ మంటగలుపుతున్నారు. 2009-12 ల మధ్య రవీంద్ర మాదాల అనే డైరెక్టర్ సుమారు నాలుగున్నర లక్షల అమెరికా డాలర్లను అందుకున్నారని నాట్స్ హెల్ప్ లైన్ ద్వారా సేకరించిన ఈ నిధులను ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే వినియోగించవలసి వున్నప్పటికీ ఈ నిధులను తన వ్యక్తిగత ప్రయోజనాలకు మళ్లించుకున్నాడని వీరయ్య చుందు ఆరోపించారు. ఇది ముమ్మాటికీ నాట్స్ నిబంధనల ఉల్లంఘనేనని అన్నారు. నాట్స్ బోర్డులోని ఇతర డైరెక్టర్లకు ఎవరికీ తెలియజేయకుండా ఆయన ఈ నిధులను మళ్లించుకున్నారని ఆరోపించారు. 2009లో సుమారు 29 వేల డాలర్లను మాదాలకు ఆయన పర్సనల్ లీగల్ ఫీజుగా చెల్లించామని ఐతే, నాట్స్ తరపున కాకుండా ఆయన ఈ సొమ్మను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వినియోగించుకున్నారని కూడా వీరయ్య చుందు పేర్కొన్నారు. ఇది నాట్స్ బై లాస్‌కు విరుద్ధమన్నారు. 2013లో అప్పారావు ముక్కామల అనే డైరెక్టర్‌పై ఈయన ఇలాంటి ఆరోపణలే మోపారు. నాట్స్ ఛారిటబుల్ ఫండ్స్‌లో లక్షా 95 వేల డాలర్లను ఇండో- అమెరికన్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్‌కు మళ్లించడం జరిగిందని, ఈ సంస్థతో సంబంధమున్న అప్పారావు ముక్కామల బోర్డుకు తెలియజేయకుండానే ఈ నిధులను స్వాహా చేశారని పేర్కొన్నారు. 2015లో... 2,16,858 డాలర్లను ఇండియాలోని గౌతు లచ్చన్న ఆర్గనైజేషన్‌కు సభ్యులకు సమాచారం ఇవ్వకుండానే బదిలీ చేశారని విమర్శించారు. అదే ఏడాది నాట్స్ ఛారిటబుల్ నుంచి 16,700 డాలర్లను అత్యధికంగా ఇండియాలోని ఓ రాష్ర్ట ముఖ్యమంత్రి సహాయ నిధికి వీటిని తరలించినట్టు పేర్కొన్నారు. ఒక రాజకీయ నేత కోసమో, రాజకీయ ప్రయోజనాల కోసమో ఈ నిధులను మళ్లించినట్టు కనబడుతున్నదనే అనుమానాన్ని వ్యక్తంచేశారు. ఇది కూడా నాట్స్ సొసైటీ నిబంధనల ఉల్లంఘనేనని అన్నారు. మరో డైరెక్టర్ చక్రధర్ ఎస్ ఓలేటి కూడా వ్యక్తిగత ప్రయోజనాల కోసం నిధులను పక్కదారి మళ్లించారని ఆయన కోర్టుకెక్కారు. అటు నాట్స్ కోశాధికారిగా చక్రధర్ ఓలేటి తన బాధ్యతలను విస్మరించి నాట్స్‌కు సంబంధించిన ఫైనాన్షియల్ రికార్డులను మెయిన్‌టెన్ చేయలేకపోయారని ఆరోపించారు. నాట్స్, డైరెక్టర్ల బోర్డు అనుమతి లేకుండానే పెద్ద ఎత్తున ఈ సంస్థ ఛారిటబుల్ ఫండ్స్‌ని మాదాలకు బదిలీ చేశారని అన్నారు. 

ఇదిలావుండగా నాట్స్ ప్రెసిడెంట్ రవి అచంట.. ముఖ్యంగా గౌతు లచ్చన్న స్వచ్ఛంద సంస్థకు తమ వంతు చేయూత అందిస్తున్న వైనాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. హుద్‌హుధ్ ధాటికి తీవ్రంగా నష్టపోయిన విశాఖను గ్రీన్ సిటీగా అభివృద్ధి చేసేందుకు లక్ష మెక్కలు నాటాలనే లక్ష్యాన్ని నిర్థేశించుకుని పనిచేస్తోందని తెలిపారు. దీంతోపాటు ఆ మొక్కలు సురక్షితంగా ఉండేందుకు ట్రీ గార్డులను కూడా నాట్స్ ఏర్పాటు చేస్తోందన్నారు. నాట్స్ ఛాప్టర్స్‌లో అనేక సేవా కార్యక్రమాలు జరగబోతున్నాయని, వచ్చే జూలై‌లో లాస్ ఏంజిల్స్‌లో అంబరాన్నంటేలా తెలుగు సంబరాలకు ఇప్పటి నుంచే తాము సిద్ధమవుతున్నామన్నారు. మరోవైపు నాట్స్ కేసుల వ్యవహారం నాట్స్ సభకు చందాలు ఇచ్చేవారిలో ఆందోళన నింపింది. నాట్స్ నిధుల గురించి ఐఆర్ఎస్ పరిశోధన మొదలైతే ఎందరు ఇబ్బందుల్లో పడతారన్నది ప్రశ్నగా మారింది. నాట్స్ సభకు వెళ్లనున్న బాలకృష్ణ, పవన్ కల్యాణ్ కూడా ఈ అంశంపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ