ఎంపీలు సీఎం రమేష్, గల్లా జయదేవ్‌లకు చంద్రబాబు షాక్‌నిచ్చారు. వీరిద్దరూ రెండు వేర్వేరు కమిటీలకు నాయకత్వం వహిస్తూ తమదే రాష్ట్ర ఒలంపిక్ సంఘం అంటూ ప్రచారం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ విషయం చివరకు కోర్టు వరకు వెళ్లింది. అయితే పార్టీలోని ఇద్దరు ఎంపీలు బహిరంగంగా గొడవపడుతున్నా చంద్రబాబు పట్టించుకోకపోవడం పార్టీ శ్రేణులను విస్మయనికి గురించేసింది. సాధారణంగా మిగితా అన్ని పార్టీలతో పోల్చితే టీడీపీలో నాయకులకు కాస్త క్రమశిక్షణ ఎక్కువనే చెప్పాలి. అలాంటింది ఎంపీల విషయంలో బాబు ఎందుకు పట్టనట్లు వ్యహరిస్తున్నారో అర్థంకాక తెలుగు తమ్ముళ్లు తికమకపడ్డారు.
చివరకు బుధవారం రంగంలోకి దిగిన చంద్రబాబు విషయాన్ని తేల్చిపారేసినట్లు సమాచారం. సీఎం రమేష్, గల్లా జయదేవ్‌లను పిలిపించుకొని చీవాట్లు పెట్టినట్లు తెలిసింది. ఇద్దర్ని పోటీనుంచి తప్పుకొని వేరే వ్యక్తులకు అవకాశం ఇవ్వాలని స్పష్టం చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఎంపీలుగా ఢిల్లీలోని అనేక కార్యకలాపాలను చక్కబెట్టాల్సి ఉంటుందని, అందుకే పోటీనుంచి తప్పుకోవాలని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో సమస్య కొలిక్కివచ్చినట్లేనని తెలుగు తమ్ముళ్లు