Advertisementt

సినీజోష్‌ ఇంటర్వ్యూ: మణిరత్నం, ఎ.ఆర్‌.రెహమాన్‌

Thu 16th Apr 2015 01:50 AM
mani ratnam new movie ok bangaram,nitya menon,a.r.rahman,prakash raj,ok bangaram on 17th april  సినీజోష్‌ ఇంటర్వ్యూ: మణిరత్నం, ఎ.ఆర్‌.రెహమాన్‌
సినీజోష్‌ ఇంటర్వ్యూ: మణిరత్నం, ఎ.ఆర్‌.రెహమాన్‌
Advertisement
Ads by CJ

దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా, నిత్యమీనన్‌ హీరోయిన్‌గా మణిరత్నం దర్శకత్వంలో తమిళంలో రూపొందిన చిత్రం ‘ఓ కాదల్‌ కన్మణి’. ఈ చిత్రాన్ని ‘ఓకే బంగారం’ పేరుతో మద్రాస్‌ టాకీస్‌, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకాలపై దిల్‌రాజు తెలుగులో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఏప్రిల్‌ 17న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్‌ వచ్చిన దర్శకుడు మణిరత్నం, సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహమాన్‌తో ఇంటర్వ్యూ. 

మణిరత్నం

మీ సినిమాల్లో ముంబాయి ఒక పార్ట్‌గా మారడానికి రీజన్‌ ఏమైనా వుందా?

నేను అక్కడ కొంతకాలం చదువుకున్నాను. అంతేకాకుండా ఇండియాలోని పెద్ద మెట్రో పాలిటన్‌ సిటీ కావడం కూడా ఒక కారణం. కొన్ని కథలు కోల్‌కత్తాలో సెట్‌ కావచ్చు, కొన్ని కథలు మరో సిటీలో సెట్‌ కావచ్చు. ప్రతి సిటీకి ఒక ఓన్‌ క్యారెక్టర్‌ వుంటుంది. ఈ సినిమా విషయానికి వస్తే ఈ కథ ముంబాయి బేస్ట్‌ కావడంతో అక్కడ తియ్యడం జరిగింది. 

మీ సినిమాల్లో ఏదో ఒక సందేశం వుంటుంది. ఈ సినిమాలో కూడా అలాంటి మెసేజ్‌ ఏదైనా వుందా? 

ఈరోజుల్లో యువతీ యువకుల యాటిట్యూడ్‌ గురించి చెప్పే కథ ఇది. ప్రస్తుతం సమాజంలోని యువత కావచ్చు, పెద్దవారు కావచ్చు వారి యాటిట్యూడ్‌ ఎలా వుంది అనేది రిప్రజెంట్‌ చేసే విధంగా ఈ సినిమా వుంటుంది. అలాగే యూత్‌కి మంచి సందేశం కూడా వుంటుంది. 

ఈ సబ్జెక్ట్‌ గురించి రీసెర్చ్‌ ఏదైనా చేశారా?

మన నిత్య జీవితంలోనే రీసెర్చ్‌ అనేది ఒక పార్ట్‌ అయిపోయింది. మనకు వచ్చే ఇన్‌పుట్సే రీసెర్చ్‌లో ఒక పార్ట్‌లా వుంటుంది. ఒక విషయం గురించి పర్టిక్యులర్‌గా తెలుసుకోవాలనుకున్నప్పుడు రీసెర్చ్‌ అనేది అవసరం అవుతుంది. జీవితంలోని ఎమోషన్స్‌ని మనం ఎక్స్‌పీరియన్స్‌ చెయ్యాల్సిందే తప్ప రీసెర్చ్‌ అవసరం లేదు. 

లివింగ్‌ రిలేషన్‌ అనేది ఒక టిపికల్‌ సబ్జెక్ట్‌. దీనివల్ల సొసైటీపై ప్రభావం వుండదంటారా?

ఈ సినిమా లివింగ్‌ రిలేషన్‌ గురించి మాత్రమే కాదు, పెళ్ళి గురించి, మనిషి యాటిట్యూడ్‌ గురించి వుంటుంది. ఇండివిడ్యువల్‌గా వున్న ప్రతి ఒక్కరూ ఈ విషయంలో ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం వుంది. 

పి.సి.శ్రీరామ్‌తో కలిసి మళ్ళీ వర్క్‌ చేశారు. మీకెలా అనిపించింది?

మేం మళ్ళీ కలిసి చెయ్యడమనే క్వశ్చన్‌ లేదు. ఎందుకంటే నా సినిమాలో అతను కూడా ఒక పార్ట్‌. ఎందుకంటే అతను నా సినిమాకి పనిచేయకపోయినా నా ప్రతి స్క్రిప్ట్‌ అతనికి తెలుసు. అతను నాకు మంచి ఫ్రెండ్‌. సినిమాలన్నింటి గురించి డిస్కస్‌ చేస్తాడు. 

మీ గత సినిమాల పాటలు వేటూరిగారు రాశారు, ఇప్పుడు సీతారామశాస్త్రిగారితో రాయించుకున్నారు. ఆ ఎక్స్‌పీరియన్స్‌ గురించి చెప్పండి?

సీతారామశాస్త్రిగారు కూడా వేటూరిగారిలాగే చాలా గొప్ప పాటలు ఇచ్చారు. వేటూరిగారి పాటల్లో వున్న ఫ్లేవర్‌ శాస్త్రిగారి పాటల్లో కూడా కనిపించింది. ఆయనతో ఈ సినిమా పాటలు రాయించుకోవడం గర్వంగా ఫీల్‌ అవుతున్నాను. 

మమ్ముట్టితో సినిమాలు తీశారు, ఇప్పుడు ఆయన కుమారుడు దుల్కర్‌తో కూడా తీశారు. వీరిద్దరి మధ్య మీరు గమనించిన తేడా? 

వాళ్ళిద్దరూ పూర్తి ఆపోజిట్‌గా వుంటారు. ఒక మహానటుడి కుమారుడిగా అతని ఇన్‌ఫ్లుయెన్స్‌ అతని మీద పడకుండా పెరగడం అనేది చాలా కష్టం. దుల్కర్‌ అతని తండ్రిని ఇన్‌ప్లుయెన్స్‌ లేకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్‌ను ఏర్పరుచుకున్నాడు. అతను ఈ సినిమా చెయ్యడం నేను చాలా హ్యాపీగా ఫీల్‌ అయ్యాను. 

ఎ.ఆర్‌.రెహమాన్‌ 

మీ అబ్బాయిని ఇంట్రడ్యూస్‌ చేస్తున్నారని తెలిసింది?

నేను మా ఫ్యామిలీ కోసం ఒక పాట చేశాను. అది మణిసర్‌ విన్నారు. ఆ పాట నాకు కావాలి, నా సినిమాలో వాడుకుంటానని చెప్పారు. దాన్ని మ్యూజిక్‌ వీడియో చెయ్యాలన్న ఆలోచన వుంది నాకు. అయితే ఆ పాటను ఆడియన్స్‌ బాగా రిసీవ్‌ చేసుకున్నారు. 

మణిరత్నంతో రెండు దశాబ్దాల పాటు వర్క్‌ చేశారు. అది ఎలా సాధ్యమైంది?

మణిరత్నంగారికి యునీక్‌ క్వాలిటీ మ్యూజిక్‌ తీసుకోవడం తెలుసు. దాని వల్లే నేను ఇన్ని సంవత్సరాలు ఆయనతో కలిసి వర్క్‌ చేయగలిగాను. ఆయనకు సినిమా హిట్‌, ఫ్లాప్‌తో సంబంధం లేదు. మంచి క్వాలిటీతో సినిమాగానీ, మ్యూజిక్‌గానీ రావాలని కోరుకుంటారు. హీరోల విషయంలో కూడా అంతే. సినిమా ఫ్లాప్‌ అయినా ఆయన పట్టించుకోరు. ఎంత బాగా హీరో పెర్‌ఫార్మ్‌ చేశారనేదే ఆయన దృష్టిలో వుంటుంది. మిమ్మల్ని ఎక్కడైనా రిజెక్ట్‌ చేస్తే ఆయన దగ్గరికి వెళ్లండి. ఆయన మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తారు. అది ఆయనలో వున్న బ్యూటిఫుల్‌ థింగ్‌. 

ఈ సినిమా కోసం మీరు చేసిన ట్యూన్స్‌ని మణిరత్నంగారు యాక్సెప్ట్‌ చేయకపోవడం జరిగిందా?

సినిమా చూసిన తర్వాత ఒక పాట సినిమా స్పీడ్‌ని తగ్గిస్తుందేమో అని మణి సర్‌కి అనిపించింది. ఆ పాట తీసేద్దామని అన్నాను. ఎందుకని అడిగారు మణిసర్‌. దానికంటే బెటర్‌ సాంగ్‌ చేద్దామని చెప్పాను. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ