‘మా’ అధ్యక్షుని ఎన్నిక ఏకగ్రీవంగా జరగడం రివాజు. పోటీవున్నా ఆరోపణలు ప్రత్యారోపణలు ఎన్నడూ పత్రికలకి ఎక్కలేదు. తెలంగాణలో తెలుగు సినిమా అభివృద్ధి; ఆంధ్రాలో తెలుగు సినిమా పరిశ్రమ స్థాపన, తెలంగాణలో నిర్మించిన చిత్రాలపై ఆంధ్రాలో పన్ను విధానం; ఆంధ్రాలో నిర్మించే చిత్రాలపై తెలంగాణలో పన్ను విధానం, రాయితీలు; ఆంధ్ర ప్రదేశ్‌లో స్టూడియోలు, రికార్డింగ్ ఎడిటింగ్ గ్రాఫిక్ సౌకర్యాలు, 24 క్రాఫ్ట్స్ వసతి వగైరా వగైరా సమస్యలు ఎన్నెన్నో. ఫిలిమ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ బాడీ ఎంపిక, సెన్సారు కార్యాలయం తదితర అంశాలెన్నో వున్నాయి. సినిమా పెద్దలు ఒకటిగా కూర్చుని ఓ నిర్ణయానికి వచ్చి ఇరు ప్రభుత్వాలతో సమాలోచనలు జరపవలసిన సమయమిది. ఈ సమయంలో ‘మా’ అధ్యక్ష ఎన్నిక జరుగుతున్న తీరు బాధ కలిగిస్తోంది. ఆంధ్రాలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వపరంగా నామినేటెడ్ పదవులు చాలా రానున్నాయి. సినిమా పెద్దలు చొరవచూపి జయసుధ - రాజేంద్రప్రసాద్ మధ్య రాజీ కుదిర్చితే బాగుండేది.