Advertisementt

సినీజోష్‌ ఇంటర్వ్యూ: వై.వి.యస్‌.చౌదరి

Thu 26th Mar 2015 11:16 AM
rey movie on 27th march,yvs chowdary,saidharam tej,sayami kher,sradha dass  సినీజోష్‌ ఇంటర్వ్యూ: వై.వి.యస్‌.చౌదరి
సినీజోష్‌ ఇంటర్వ్యూ: వై.వి.యస్‌.చౌదరి
Advertisement
Ads by CJ

మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా యలమంచిలి గీత సమర్పణలో బొమ్మరిల్లు పతాకంపై వై.వి.యస్‌.చౌదరి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన భారీ చిత్రం ‘రేయ్‌’ ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో దర్శకనిర్మాత వై.వి.యస్‌.చౌదరితో ‘సినీజోష్‌’ ఇంటర్వ్యూ. 

‘రేయ్‌’ అనే టైటిల్‌కి జస్టిఫికేషన్‌ ఏమిటి?

‘రేయ్‌’ అనేది జనరల్‌గా మనం పిలుచుకునే పిలుపు. కానీ, ఈ సినిమా విషయానికి వస్తే హీరో తన లక్ష్యం చేరుకోవడానికి కసితో అనే మాట. 

ఈ సినిమాలో సాయిధరమ్‌ క్యారెక్టరైజేషన్‌ ఎలా వుంటుంది?

మొదట బహమాస్‌లో ఒక సినిమా చెయ్యాలన్న థాట్‌ వచ్చింది. అక్కడ సినిమా చెయ్యడం కోసం ఏదో ఒక కథ అనుకోకుండా దానికి తగ్గట్టుగా లైన్‌ ఆలోచించుకొని సబ్జెక్ట్‌ రెడీ చేయడం జరిగింది. ఉదాహరణగా చెప్పాలంటే వెస్టిండీస్‌ టీమ్‌లో శివనారాయణ్‌ చంద్రపాల్‌, రామ్‌నారాయణ్‌ వంటి క్రికెటర్లు మన ఇండియన్‌ హారిజన్‌కి చెందినవారు వున్నారు. వారి గురించి ఆలోచించిన తర్వాత జమైకా బ్యాక్‌డ్రాప్‌లో ఒక కథ చేస్తే ఎలా వుంటుంది అనిపించింది. జమైకాలోని యూత్‌ చాలా లౌడ్‌గా వుంటారు. వాళ్ళు మామూలుగా మాట్లాడినా లౌడ్‌గా మాట్లాడినట్టే వుంటుంది. అలాంటి ఒక క్యారెక్టర్‌ని తీసుకొని సాయిధరమ్‌ క్యారెక్టరైజేషన్‌ చేయడం జరిగింది. 

ఎంతో క్రేజ్‌ తెచ్చిన ‘పవనిజం’ సాంగ్‌ని ‘రేయ్‌’తోపాటు ఆడియన్స్‌ చూసే అవకాశం వుందా?

ఈ పాటకు సంబంధించిన షూటింగ్‌ కంప్లీట్‌ అయింది. ప్రస్తుతం దానికి సంబంధించిన గ్రాఫిక్‌ వర్క్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. సాంగ్‌ పర్‌ఫెక్ట్‌గా రెడీ అయిన తర్వాత సినిమాకి యాడ్‌ చేస్తాం. ఈ పాటను ముందే షూట్‌ చెయ్యడం వల్ల బయటికి వచ్చేస్తుందేమోనన్న ఆలోచనతో సినిమా రిలీజ్‌కి ముందు ప్లాన్‌ చెయ్యడం జరిగింది. ‘పవనిజం’ సాంగ్‌ కోసం మెగాభిమానులు ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు.

పెద్ద హీరోలతో సినిమాలు చేశారు, కొత్త హీరోలతో కూడా సినిమాలు చేశారు. వారిలో మీరు ఎలాంటి డిఫరెన్స్‌ని చూశారు?

ఒక పెద్ద హీరోలంటే వారికి ఒక స్పెషల్‌ ఇమేజ్‌ వుంటుంది. వారి ఇమేజ్‌కి తగ్గట్టు, వారి బాడీ లాంగ్వేజ్‌ని బట్టి, ఆ హీరోల ఫ్యాన్స్‌ ఎలాంటి అంశాలు ఎక్స్‌పెక్ట్‌ చేస్తారు అనే విషయాల్ని పరిగణనలోకి తీసుకొని సబ్జెక్ట్‌ రెడీ చెయ్యాల్సి వుంటుంది. అదే కొత్త హీరోలతో సినిమా అంటే వారికి ఎలాంటి ఇమేజ్‌ వుండదు కాబట్టి వారిని ఆడియన్స్‌ యాక్సెప్ట్‌ చేసేలా ఒక కొత్త ఇమేజ్‌ని మనమే ఇవ్వాల్సి వుంటుంది. 

ఈ చిత్రాన్ని విడుదల చెయ్యడంలో ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. ఎందువల్ల?

కొన్ని సందర్భాల్లో ఎదురయ్యే సమస్యలకు ఎవరూ ఏమీ చేయలేరు. ఈ సినిమా విషయంలో అలాంటి సమస్యలు చాలా వచ్చాయి. మలేషియాలో 8 రోజులు షూటింగ్‌ చేద్దామని వెళ్ళాం. వర్షం వల్ల ఆ షెడ్యూల్‌ 25 రోజులు పట్టింది. ఆ తర్వాత సాయి కాలుకి గాయమైంది. రెండు నెలలు రెస్ట్‌ తీసుకోవాలని చెప్పారు. అలా రెండు నెలలు పోస్ట్‌ పోన్‌ అయింది. అలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్‌తో సినిమా కంప్లీట్‌ అయింది. సినిమా రిలీజ్‌ చెయ్యడానికి సరైన టైమ్‌ దొరకలేదు. భారీ బడ్జెట్‌తో చేసిన సినిమాని కరెక్ట్‌ టైమ్‌లో రిలీజ్‌ చెయ్యకపోతే సినిమాకి చాలా అన్యాయం జరుగుతుంది. ఈ సమ్మర్‌కి కరెక్ట్‌ టైమ్‌ అనుకున్నాం. అందుకే ఈ శుక్రవారం రిలీజ్‌ చేస్తున్నాం. 

‘రేయ్‌’లో మెయిన్‌ హైలైట్‌ గురించి చెప్పాలంటే?

క్లైమాక్స్‌లో వచ్చే సాంగ్‌ సినిమాకి హైలైట్‌ అవుతుంది. సాధారణంగా పాట మూడు, నాలుగు నిముషాలు మాత్రమే వుంటుంది. కానీ, క్లైమాక్స్‌లో వచ్చే ఈ సాంగ్‌ 8 నిముషాలు వుంటుంది. దానికి చంద్రబోస్‌గారి సాహిత్యం, చక్రిగారి మ్యూజిక్‌ చాలా అద్భుతంగా కుదిరాయి. ఈ పాటతోపాటు శ్రద్ధాదాస్‌ డాన్స్‌ పార్ట్‌ రెండు నిముషాలు వుంటుంది. అంటే టోటల్‌గా క్లైమాక్స్‌ పార్ట్‌ 11 నిముషాలు నడుస్తుంది. 

హాలీవుడ్‌, బాలీవుడ్‌లో వున్న పాప్‌ కల్చర్‌ తెలుగు ఆడియన్స్‌కి ఎంతవరకు కనెక్ట్‌ అవుతుంది?

పాప్‌ అంటే వెర్రెక్కించే మ్యూజిక్‌, పిచ్చెక్కించే సాహిత్యం, వేడెక్కించే కాస్ట్యూమ్స్‌. సాహిత్యంలోని పదాలు కూడా కాంట్రవర్సీగా వుంటేనే అక్కడి ఆడియన్స్‌కి రీచ్‌ అవుతుంది. నిజానికి హాలీవుడ్‌లోని పాప్‌ స్టార్స్‌లో అంతగా డాన్స్‌ మూమెంట్స్‌ వుండవు. వారితో పోలిస్తే మనవాళ్ళు చాలా ఎక్స్‌ట్రార్డినరీగా డాన్స్‌ చేయగలరు. ఎంతో స్పెషాలిటీ వున్న ఒక పాప్‌ టైటిల్‌ని హీరో, హీరోయిన్‌ ట్రూప్‌ అమెరికా వెళ్ళి ఎలా గెలుచుకున్నారనేదే కథ. దాన్ని ఆడియన్స్‌కి కనెక్ట్‌ అయ్యేలా ఎలా చెప్పామన్నదే పాయింట్‌. ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే అవతార్‌ మనకు సంబంధించిన సినిమా కాదు. అలాంటి సినిమాలు ఎన్నో తెలుగులో డబ్‌ అయితే అద్భుతంగా ఆదరించారు. ఈ సినిమా విషయానికి వస్తే ఒక ఇండియన్‌ హారిజన్‌ అబ్బాయి, ఇక్కడి ఒక అమ్మాయి అమెరికా వెళ్ళి వరల్డ్‌ టైటిల్‌ని గెలుచుకోవడం అనేది ఎంతో ఎమోషనల్‌గా, ఎంతో ఇంట్రెస్టింగ్‌ చూపించడం జరిగింది. అది మన ఆడియన్స్‌కి హండ్రెడ్‌ పర్సెంట్‌ కనెక్ట్‌ అవుతుంది. 

సయామీఖేర్‌, శ్రద్ధాదాస్‌ల గురించి?

ఒక కొత్త హీరోయిన్‌ని తీసుకోవాలన్న ఆలోచన ముందే వుంది. ఈ సబ్జెక్ట్‌ ప్రకారం సయామీ అయితే బెటర్‌ అనిపించింది. ఎందుకంటే ఆమెకి బ్రెజిలియన్‌ లుక్‌ వుంటుంది. ఇందులోని క్యారెక్టర్‌కి పర్‌ఫెక్ట్‌గా సూట్‌ అవుతుందనిపించింది. శ్రద్దాదాస్‌ క్యారెక్టర్‌ ఈ సినిమాకి ఆక్సిజన్‌లాంటిది. ఇందులో హీరో క్యారెక్టర్‌ పవర్‌, హీరోయిన్‌ క్యారెక్టర్‌ ఎనర్జీ అయితే శ్రద్ధాదాస్‌ చేసిన జెన్నా క్యారెక్టర్‌ ఆక్సిజన్‌లాంటిది. ఈ ముగ్గురికీ ఈ సినిమా విపరీతమైన పేరు తెస్తుంది. 

ఫైనల్‌గా ‘రేయ్‌’ గురించి ఏం చెప్పదలుచుకున్నారు?

ఈ సినిమాలో ఎనర్జీ వుంటుంది తప్ప ఎక్కడా ఏడుపులు, బాధలు, సెట్‌బ్యాక్‌ అనేవి వుండవు. యూత్‌ఫుల్‌గా వుంటుంది. కొత్త డిజైన్‌లో వుండే   లవ్‌స్టోరీ వుంది. కొత్త బ్యాక్‌డ్రాప్‌ వుంది, డాన్సులున్నాయి, మ్యూజిక్‌ వుంది. ఫస్ట్‌ హాఫ్‌ అంతా నల్లవాళ్ళు కనపడతారు, సెకండాఫ్‌ అంతా తెల్లవాళ్ళు కనపడతారు. వీటన్నింటినీ మించి మెగాస్టార్‌ మేనల్లుడు కాబట్టి ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే మెగా అభిమానుల ఎనర్జీ లెవల్స్‌ పెంచే అంశాలు ఇందులో వున్నాయి. చిరంజీవిగారి ‘గోలీమార్‌’ రీమిక్స్‌ సాంగ్‌ వుంది. అందులోనే పవన్‌కళ్యాణ్‌గారి ‘చికితా...’ పాట కూడా యాడ్‌ చేశాం. మెగా అభిమానులకు ఈ సినిమా ఒక పండగలా వుంటుంది అంటూ ఇంటర్వ్యూ ముగించారు వై.వి.యస్‌.చౌదరి 

 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ