చుక్కా రామయ్య గారూ!
‘‘ఇంటర్ విద్యను ప్రక్షాళన చేయకుండా ఇంటర్ మార్కులను ఆధారం చేసుకొని ఇంజనీరింగ్ చదువు కొనసాగిస్తే మరింత మాల్ ప్రాక్టీసులు పెరిగే అవకాశం ఏర్పడుతుంది’’ అని చుక్కా రామయ్య ‘సాక్షి’ దిన పత్రికలో పేర్కొన్నారు.
అంటే, ఇంటర్ పరీక్షల నిర్వహణలో మాల్ ప్రాక్టీసు జరుగుతోందని అంగీకరించినట్టుగదా! అటువంటి మాల్ ప్రాక్టీసు మార్కులకి ఎంసెట్ మార్కులతోపాటు వెయిటేజీ ఎలా ఇస్తున్నారు? ఎమ్మెల్సీగా వుండీ ఇంటర్ వెయిటేజీ మార్కులని ఎందుకు ప్రతిఘటించలేదు?
ఇంటర్ పరీక్షలు, ఏఏ కాలేజీలలో నిర్వహిస్తున్నారో, అదే కాలేజీలలో ఎంసెట్ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. ఆ కాలేజీ సిబ్బందే ఇన్విజిలేటర్లుగా వ్యవహరిస్తున్నారు. ఎంసెట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించినవారు (ఐపిఈ) ఇంటర్ పరీక్షలను అదే స్థాయిలో ఎందుకు నిర్వహించడంలేదు?
ఇంటర్ మార్కులకి వెయిటేజీ ఇస్తున్న నేపధ్యంలో ఆంధ్ర , తెలంగాణ వేర్వేరుగా ఇంటర్ పరీక్షలు అన్నప్పుడు ప్రతిఘటించకుండా ‘ఎంసెట్’ని మాత్రమే పంచాయితీచేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలా మీరూ మాట్లాడటం సమంజసంగా లేదు.
-తోటకూర రఘు