Advertisementt

తారక్ తో డాన్స్ నాకు ఛాలెంజ్ - హృతిక్

Tue 14th Jan 2025 03:36 PM
hrithik roshan  తారక్ తో డాన్స్ నాకు ఛాలెంజ్ - హృతిక్
Challenge me to dance with Tarak - Hrithik తారక్ తో డాన్స్ నాకు ఛాలెంజ్ - హృతిక్
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ డాన్స్ కి అభిమానులే కాదు స్టార్ హీరోలు కూడా సర్ ప్రైజ్ అవుతూ లైక్ చేస్తారు. ఎన్టీఆర్ డాన్స్ ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు, కామన్ ఆడియన్స్ అప్రిషేట్ చేస్తారు. తాజాగా ఎన్టీఆర్ తో డాన్స్ నాకు ఛాలెంజ్ అంటూ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. హృతిక్ రోషన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటూ హిందీ కి స్పెషల్ ఎంట్రీ ఇస్తున్న తారక్ వార్ 2 తో ప్రేక్షకులకు ట్రీట్ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే.

వార్ 2 లో హృతిక్ రోషన్-తారక్ లతో ఓ స్పెషల్ డాన్స్ సెట్ చేసారు. ఈ స్పెషల్ నెంబర్ లో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ద కపూర్ కాలు కడపబోతుంది అనే టాక్ ఉంది. తాజగా హృతిక్ రోషన్ ఓ ఇంటర్వ్యూ లో తారక్ డాన్స్ గురించి మట్లాడుతూ.. నా కాళ్ళు బలంగా ఉండాలని కోరుకుంటున్నానని, వార్ 2 స్పెషల్ సాంగ్ పోటీలో నిలిచేందుకు సంసిద్ధమవుతున్నానని చెప్పడం తారక్ డాన్స్ పై ఒక్కసారిగా అంచనాలు పెంచేలా చేసింది. 

మరి ఎన్టీఆర్-హృతిక్ రోషన్ లు కలిసి డాన్స్ చేస్తూ కనిపిస్తే అభిమానులకి పూనకాలే. చైర్స్ లో కూడా కూర్చోకుండా థియేటర్స్ లో డాన్స్ చెయ్యడం ఖాయంగానే కనబడుతుంది ప్రస్తుతం హృతిక్ చేసిన కామెంట్స్ చూస్తుంటే. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంటే శ్రద్ద కపూర్ స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. 

 

Challenge me to dance with Tarak - Hrithik:

Hrithik Roshan Gives Hype To Dance Number With NTR

Tags:   HRITHIK ROSHAN