`దబిడి దిబిడి` పాటతో మరోసారి ఊర్వశి రౌతేలా పేరు మార్మోగిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఈ పాటలో బాలయ్యతో ఊర్వశి స్టెప్పుల గురించి ఏదో ఒక చోట ముచ్చట సాగుతోంది. ఇంతలోనే ఇప్పుడు ఊర్వశి రౌతేలా లేటెస్ట్ ఫోటోషూట్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది.
బంగారం ఛమ్కీల మెరుపులు పర్పుల్ కలర్ గౌనులో ఊర్వశి అందం మతి చెడగొడుతోంది. ముఖ్యంగా థై స్లిట్ గౌనులో ఊర్వశి హొయలు ఊరిస్తున్నాయి. బోల్డ్ ఫోటోషూట్లతో నిరంతరం ట్రీటిచ్చే ఈ భామ మరోసారి గ్లామర్ హద్దులు చెరిపేసింది. ప్రఖ్యాత మసాలా మ్యాగజైన్ కవర్ షూట్ పై ఇలా మెరిసింది. ఊర్వశి ఎంపిక చేసుకున్న ఈ దుస్తులకు తగ్గట్టు ఆభరణాల ఎంపిక, మేకప్ స్టైల్ ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఈ కొత్త లుక్ యూత్ లో వైరల్ గా షేర్ అవుతోంది.
ఊర్వశి స్వగతం:
ఊర్వశి రౌతేలా అందాల పోటీ టైటిల్ హోల్డర్. ప్రధానంగా హిందీ, తెలుగు చిత్రాలలో నటిస్తోంది. మిస్ దివా- మిస్ యూనివర్స్ ఇండియా 2015 టైటిల్ గెలుచుకున్న తర్వాత, 2015లో మిస్ యూనివర్స్ గా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. 15 సంవత్సరాల వయస్సులో తన మోడలింగ్ కెరీర్‌ను ప్రారంభించింది. గతంలో మిస్ టీన్ ఇండియా 2009 టైటిల్‌ను కూడా గెలుచుకుంది. రౌతేలా 2013లో సింగ్ సాబ్ ది గ్రేట్ (2013)తో తన నటనా రంగ ప్రవేశం చేసింది. అప్పటి నుండి సనమ్ రే (2016), గ్రేట్ గ్రాండ్ మస్తీ (2016), హేట్ స్టోరీ 4 (2018), పాగల్‌పంతి (2019), డాకు మహారాజ్ (2025) వంటి హిట్ చిత్రాలలో నటించింది. ఊర్వశి పలు తెలుగు చిత్రాల్లో ఐటమ్ నంబర్లలో మెరిసింది.
ఊర్వశి రౌతేలా 1994 ఫిబ్రవరి 25న ఉత్తరాఖండ్- కోట్ద్వార్ లో మీరా రౌతేలా - మన్వర్ సింగ్ రౌతేల దంపతులకు గర్హ్వాలి రాజ్‌పుత్ కుటుంబంలో జన్మించింది. కోట్ద్వార్‌లోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ స్కూల్‌లో చదువుకుంది. ఢిల్లీలోని గార్గి కళాశాలలోను విద్యనభ్యసించింది.