యంగ్ టైగర్ ఎన్టీఆర్-బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలయికలో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న క్రేజీ యాక్షన్ ఎంటర్టైనర్ వార్ 2 చిత్ర షూటింగ్ ఇప్పటికే అయ్యింది. ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ కంప్లీట్ చేసేసి ఆయన హైదరాబాద్ వచ్చేసారు. అయితే అయాన్ ముఖర్జీ వార్ 2 చిత్రాన్ని ఆగష్టు 14 న రిలీజ్ అంటూ ఎపుడో ప్రకటించారు.
వార్ 2 పై భారీ అంచనాలున్నాయి. ఆగష్టు రెండో వారమంటే స్వాతంత్య్ర దినోత్సవం సెలవు, వరలక్ష్మి వ్రతం, కృష్ణాష్టమి సెలవు అన్ని కలిసొచ్చే వారమది. ఇప్పుడు అదే రోజు సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా వార్ డిక్లేర్ చేసారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజినీకాంత్ నటిస్తున్న కూలి షూటింగ్ పూర్తయ్యింది.
ఈరోజు కూలి చిత్రాన్ని వార్ 2 పైకి వదలబోతున్నట్టుగా రిలీజ్ డేట్ ప్రకటించారు. కూలి ఆగష్టు 14 న రిలీజ్ అంటూ ప్రకటించడంతో ఎన్టీఆర్-హృతిక్ తో రజిని వార్ డిక్లేర్ చేసారుగా అంటూ కామెంట్ చేస్తున్నారు.