కీర్తి సురేష్ గత కొన్నేళ్లుగా తెలుగు సినిమాలకు కొంత దూరంగా ఉంది. 2023 తర్వాత టాలీవుడ్‌లో కొత్త ప్రాజెక్టులు అంగీకరించడం తగ్గించింది. ఇదే సమయంలో ఆమె వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఈ గ్యాప్ కారణంగా ఇక ఆమె తెలుగు పరిశ్రమకు పూర్తిగా గుడ్‌బై చెబుతుందని అనుకున్నారు.
అయితే సినిమాల సంఖ్య తగ్గించినా.. కెరీర్‌ను మాత్రం కొనసాగిస్తోంది. తెలుగు కంటే తమిళం, హిందీ చిత్రాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. కానీ ఇప్పుడు మళ్లీ టాలీవుడ్‌లో అవకాశం కోసం దృష్టిపెట్టింది. త్వరలోనే నితిన్ సరసన నటించే అవకాశం కీర్తి సురేష్‌కు దక్కనున్నట్లు తెలుస్తోంది. బలగం ఫేమ్ వేణు దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించనున్న ఎల్లమ్మ సినిమాలో ఆమె హీరోయిన్‌గా ఎంపిక కాబోతోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
ఇప్పటి వరకు ఈ సినిమాలో ప్రధాన కథానాయికగా సాయిపల్లవి పేరు వినిపించింది. కానీ రామాయణ్ హిందీ చిత్రంతో బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్ నుంచి ఆమె తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో ఆ అవకాశం కీర్తి సురేష్‌ను వరించింది.
గతంలో రంగ్ దే సినిమాలో నితిన్, కీర్తి సురేష్ జంటగా నటించారు. ఇప్పుడు ఎల్లమ్మలో మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ఈ సినిమా తన కెరీర్‌కు భారీ టర్నింగ్ పాయింట్ అవుతుందని నితిన్ భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నాడు. మరి కీర్తి సురేష్ టాలీవుడ్‌లో మళ్లీ సత్తా చాటుతుందా..? వేచి చూడాలి.