తమిళ హీరో ధనుష్ దర్శకుడిగా తెరకెక్కిన జాబిలమ్మ నీకు అంత కోపమా చిత్రం గత నెలలో థియేటర్స్ లో విడుదలై డీసెంట్ టాక్ తెచ్చుకుంది. తమిళంలోనే కాకుండా, తెలుగులోనూ ఏక కాలంలో విడుదలైన జాబిలమ్మ నీకు అంత కోపమా చిత్రం ఫిబ్రవరి 21 న థియేటర్స్ లో విడుదలైంది.
థియేటర్స్ లో విడుదలైన నెల రోజులకి జాబిలమ్మ నీకు అంత కోపమా చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ జాబిలమ్మ నీకు అంత కోపమా డిజిటల్ హక్కులను ద్కకించుకోగా.. ఇప్పడు ఈ చిత్రాన్ని మార్చి 21 నుంచి స్ట్రీమింగ్ లోకి తేనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.
థియేటర్లలో డీసెంట్ హిట్ గా నిలిచిన ఈ చిత్రాన్ని అక్కడ మిస్ అయినవారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసెయ్యండి.