డిసెంబర్ లో తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీని హిందూ, క్రిష్టియన్ సంప్రదాయాల్లో వివాహం చేసుకున్న కీర్తి సురేష్ ఆతర్వాత సినిమా ప్రమోషన్స్ లో బిజీగా మారిపోయింది. ఆమె హిందీలో నటించిన చిత్రం విడుదలయ్యాక భర్త ఆంటోనీతో కలిసి థాయిలాండ్ కి హనీమూన్ వెళ్ళొచ్చింది.
ఈమధ్యన కీర్తి సురేష్ కి హిందీ నుంచి ఆఫర్స్ వస్తున్నాయనే టాక్ నడుస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే కీర్తి సురేష్ పెళ్లి తర్వాత నటనకు కానీ, గ్లామర్ షో కి కానీ ఫుల్ స్టాప్ పెట్టే ఉద్దేశ్యమే లేదు. అందుకే తరచూ గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తుంది.
తాజాగా కీర్తి సురేష్ షేర్ చేసిన పిక్స్ చూస్తే కీర్తి సురేష్ ఏమాత్రం తగ్గడం లేదుగా అంటూ కామెంట్ చేస్తారు. కొలంబో డైరీస్.. Ayubowan #Colombo You were such a Vibe అంటూ పోస్ట్ చేసిన పిక్స్ లో కీర్తి సురేష్ నిజంగా బ్యూటిఫుల్ గా ఉంది అనే చెప్పాలి..