రామ్ చరణ్ గేమ్ చేంజర్ రిజల్ట్ ని పక్కనపెట్టేసి RC16 చీర సెట్స్ లో బిజీ అయ్యారు. బుచ్చిబాబు దర్శకత్వంలో హైదరాబాద్ లో జరుగుతున్న నైట్ షూట్స్ లో రామ్ చరణ్ నిర్విరామంగా పాల్గొంటున్నారు. హైదరాబాద్ బూత్ బంగ్లా లో RC16 షూటింగ్ ని గత నెలరోజులుగా చిత్రీకరిస్తున్నారు. ఇంత పెద్ద షెడ్యూల్ ని బుచ్చిబాబు చాగా ఫాస్ట్ గా ఫినిష్ చేస్తున్నాడు.
తాజాగా RC16 ఓటీటీ డీల్ పై ఓ క్రేజీ న్యూస్ తెగ హైలెట్ అయ్యింది. కొన్నాళ్లుగా భారీ బడ్జెట్ సినిమాలను నెట్ ఫ్లిక్ భారీ డీల్స్ తో చేజిక్కించుకుంటుంది. కానీ ఈసారి RC16 కోసం సోని లివ్ ఓటీటీ ప్లాట్ ఫామ్ దిమ్మతిరిగే ప్రపోజల్ పెట్టినట్లుగా టాక్ వినబడుతుంది. కానీ RC 16 మేకర్స్ మాత్రం నెట్ ఫ్లిక్స్ తోనే ఒప్పందం చేసుకోవడానికి ఆశక్తి చూపిస్తున్నారట.
నెట్ ఫ్లిక్స్ కూడా భారీగానే కోట్ చేసినట్లుగా తెలుస్తుంది. రామ్ చరణ్ గత చిత్రం గేమ్ చేంజర్ ఎఫెక్ట్ ఏ మాత్రము RC16పై పడలేదు అని ఈ ఓటీటీ డీల్ చూస్తే అర్హమవుతుంది. ఈచిత్రంలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, హీరోయిన్ గా జాన్వీ కపూర్, జగపతి బాబు లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.