సక్సెస్ వస్తే హీరోలు ఎంతగా పార్టీలు చేసుకుని ఎంజాయ్ చేస్తారో, హీరోయిన్స్ అంతకు మించిన ఆనందంతో సక్సెస్ ని తనివితీరా అనుభవిస్తారు. ఒక సక్సెస్ వస్తే.. తదుపరి స్టార్ ఛాన్సెస్ వస్తాయని హీరోయిన్స్ కలలు కంటారు. కాని ఇప్పుడొక టాప్ హీరోయిన్ తాను నటించిన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినా ఆ సక్సెస్ ని అనుభవించలేని పరిస్థితుల్లో పడుతుంది.
సినిమా సక్సెస్ అవ్వగానే ఆమె చుట్టూ కాంట్రావర్సీలు నెలకొంటున్నాయి. డిసెంబర్ లో పుష్ప 2 తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రష్మిక మందన్న ఆ చిత్ర విజయోత్సవాన్ని టీమ్ తో కానీ ఫ్రెండ్స్ తో కానీ సెలెబ్రేట్ చేసుకోలేకపోయింది. కారణం సంధ్య థియేటర్ తొక్కిసలాట ఆమె ఆనందాన్ని ఆవిరి చేసింది. అంతేకాదు రష్మిక ఇతరత్రా షూటింగ్స్ తో బిజీ అయ్యింది.
ఇప్పుడు బాలీవుడ్ లో యానిమల్ తర్వాత మళ్లీ అంత సక్సెస్ ను చావా తో రష్మిక అందుకుంది. కానీ ఆ విజయాన్ని ఆసాంతం ఆస్వాదించలేని పరిస్థితిలో రష్మిక ఉంది. కారణం చావా ప్రమోషన్స్ లో రష్మిక నేను హైదరాబాద్ అమ్మాయిని, హైదరాబాద్ నుంచి వచ్చాను అంటూ తన మాతృ భాష కన్నడ ప్రేక్షకులను హర్ట్ చేసింది. దానితో చావా సినిమా విడుదలై హిట్ కొట్టినా రష్మిక సోషల్ మీడియాలో తనపై వచ్చే ట్రోల్స్ తో సతమతమవుతోంది.
కన్నడ అమ్మాయి అయిఉండి.. ఇలా హైద్రాబాద్ అమ్మాయిని అని మట్లాడడం కన్నడీగులకు అసలు నచ్చలేదు. దానితో సోషల్ మీడియాలో రశ్మికను గట్టిగా ఏసుకుంటున్నారు. ఇలాంటి కాంట్రవర్సీ మాటలు రష్మిక ఆనందాన్ని ఆవిరి చేస్తున్నాయి. తన విజయాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించలేకపోతుంది.