మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేయలని ఏ డైరెక్టర్ కి ఉండదు, సీనియర్ డైరెక్టర్ అయినా, కుర్ర అయినా, డెబ్యూ డైరెక్టర్ అయినా ప్రతి డైరెక్టర్ కి మెగాస్టార్ చిరు తో సినిమా చెయ్యాలనే కోరిక, కల ఉంటుంది. అదే మాదిరి కల్కి తో 100 కోట్లు కొల్లగొట్టిన నాగ్ అశ్విన్ కూడా చిరుతో సినిమా చెయ్యాలనే కల ఉందట.
నాగ్ అశ్విన్ అడగాలే కానీ ఎంతటి స్టార్ హీరోనైనా సినిమా చేయడానికి రెడీ అవుతారు. కానీ నాగ్ అశ్విన్ మాత్రం మెగాస్టార్ ను డైరెక్ట్ చేయడమనేది తన కలగా చెప్తున్నాడు. తాజాగా ఓ ఈవెంట్ లో పాల్గొన్న నాగ్ అశ్విన్ అక్కడికి గెస్ట్ గా వచ్చిన చిరుని చూసి ఈ విధమైన కామెంట్స్ చేసారు.
చిరంజీవి గారు తన ఫేవరెట్ హీరో, ఆయన్ని చూసే సినిమాల్లోకి వచ్చానని, అలాంటి ఆయనతో కలిసి ఇవాళ స్టేజ్ మీద నిల్చోవడం చాలా ఆనందంగా ఉందని, చిరంజీవి గారితో సినిమా చేయాలని ప్రతీ డైరెక్టర్‌కీ ఉన్నట్టే తనకు కూడా ఆయనతో సినిమా చేయడం కల అని, ఆ కల ఎప్పుడు నెరవేరుతుందా అని ఎంతగానో వెయిట్ చేస్తున్నట్టు నాగ్ అశ్విన్ చెప్పగా..
దానికి చిరు త్వరగా కల్కి 2 పూర్తి చేసి వస్తే నేను రెడీ అంటూ నాగ్ అశ్విన్ ని ఆటపట్టించారు.