రాజకీయాల్లోకి వచ్చి ఏదో సాధిద్దామని ప్రజారాజ్యం పార్టీ పెట్టి 18 సీట్లతో సరిపెట్టుకుని ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో కలిపేసిన మెగాస్టార్ చిరంజీవి తొమ్మిదేళ్ళు సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. ఆ తర్వాత సినిమాల్లోకి కమ్ బ్యాక్ ఇచ్చి రాజకీయాలకు దూరంగా ఫైనల్ గా ఆయన సినిమాల్లోనే కొనసాగుతున్నారు. చాలా సందర్భాల్లో చిరంజీవి రాజకీయ జీవితంపై పలు వార్తలు చుట్టుముట్టినా మెగాస్టార్ స్పందించలేదు.
తాజాగా చిరంజీవి రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేసారు. బ్రహ్మానందం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చిన మెగాస్టార్ చిరు లైఫ్ లాంగ్ పాలిటిక్స్ లోకి అడుగుపెట్టను అంటూ ప్రకటించారు. పెద్దలను కలిసేది రాజకీయాల కోసమే అని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. సినిమాలు చేస్తూ కళామతల్లి సేవలోనే ఉంటాను.
మంచి మంచి సినిమాలు చేస్తాను, నేను కలిసేది, నన్ను కలిసే వాళ్లను చూసి నేను రాజకీయాల్లోకి వెళతానేమోని చాలామంది డౌట్ పడుతున్నారు. నేను రాజకీయ నాయకులను, పెద్దలను కలిసేది కేవలం సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి కోసమే. నా లక్ష్యాలను, సేవలను ముందుకు తీసుకెళ్లేందుకు పవన్ కళ్యాణ్ ఉన్నాడు. నా ఆశయాలను పవన్ నేరుస్తాడు.. అంటూ మెగాస్టార్ చిరు ఆ ఈవెంట్ లో పాలిటిక్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు.