చాలామందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. నాన్ వెజ్ ప్రియులకు రోజు ఏదో ఒక నీసు కూర ఉండాల్సిందే. అందులోనూ చికెన్ అయితే ఆబగా లాగించేస్తారు. చికెన్ 65 దగ్గర నుంచి చికెన్ బిర్యానీ వరకు.. చికెన్ లో ఎన్ని రకాల వంటలున్నాయో అన్నిటిని లాగించేస్తారు. ఆంధ్రలో పెళ్లిళ్లకు నాన్ వెజ్ పెట్టరు కానీ, తెలంగాణాలో పెళ్లిళ్లకు పేరంటాలకు నాన్ వెజ్ లేనిదే భోజనాలు పెట్టరు.
ఇక ఫ్రెండ్స్ వచ్చినా, చుట్టాలొచ్చినా చిటికలో వెళ్లి తెచ్చి గబగబా వండేసేది కేవలం చికెన్ మాత్రమే. ఇక ఒక్కొక్కసారి చికెన్ ధర విపరీతంగా పెరిగినా వారినికొకసారి చికెన్ తినకపోతే నిద్రపట్టదు. అలాంటి చికెన్ తింటే ఇప్పడు డైరెక్ట్ గా ఆసుపత్రికే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కోళ్లకు వచ్చే జబ్బు బర్డ్ ప్లూ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కోళ్ల ఫారంస్ లోని కోళ్లను తుడిచిపెట్టేస్తుంది.
ఆంధ్ర-తెలంగాణలోని కోళ్లకు బర్డ్ ప్లూ సోకి మృత్యువాతపడుతుండగా.. చికెన్ తినే వారికీ ఆ వ్యాధి సోకె ప్రమాదం ఉంది అంటున్నారు. ఇప్పటికే లక్షలాది కోళ్లు ఈ వైరస్ బారినపడి చనిపోయాయి. దీంతో ఈ వైరస్ మనుషులకు సోకకుండా వైద్యారోగ్య శాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పౌల్ట్రీ ఫారాల్లో కోళ్లు హఠాత్తుగా మరణిస్తుండటంతో పశుసంవర్ధక శాఖ అధికారులు అప్రమత్తమయ్యాయి. మహారాష్ట్రతో పాటు తెలంగాణలో కూడా బర్డ్ ప్లూ కేసులు బైటపడటంతో చనిపోయిన కోళ్లనుండి శాంపిల్స్ సేకరించి టెస్టులు చేపట్టారు.
కొద్దిరోజులు చికెన్ తినకూడదని హెచ్చరిస్తున్నారు.. బర్డ్ ప్లూ కోళ్ల ద్వారా మనుషులకు సోకే ప్రమాదముంది కాబట్టి ఆహార నియమాలు పాటించాలని సూచిస్తున్నారు వైద్యారోగ్య శాఖ అధికారులు. సో ఈలెక్కన చికెన్ కి దూరంగా ఉండడం ఉత్తమం అన్నమాట.