పదేళ్ల పాటు మకుటం లేని మహారాజు గా తెలంగాణను పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఏడాది కాలంగా ఫార్మ్ హౌస్ కి పరిమితమయ్యారు కాని.. ప్రజల్లోకి రాకుండా మొహం చాటేస్తున్నారు. 2023 తెలంగాణ ఎన్నికల తర్వాత ఓటమి చవిచూసిన కేసీఆర్ ఆ తర్వాత అసంబ్లీకి వెళ్లకుండా కాలు విరగ్గొట్టుకోవడం, అనారోగ్యం బారిన పడడం, ఫామ్ హౌస్ లో వ్యవసాయం అంటూ బయటికి రావడమే మానేసారు.
గత ఏడాది కాలంగా రేవంత్ రెడ్డిని ఫేస్ చేయలేకో, లేదంటే ఓటమిని జీర్ణించుకోలేకో మధనపడిన కేసీఆర్ ఫైనల్లీ ప్రజల్లోకి రాబోతున్నారు. ఏడాది కాలంగా కేవలం నాలుగైదుసార్లు మాత్రం ఫార్మ్ హౌస్ నుంచి బయటికొచ్చిన కేసీఆర్ కి లోక్ సభ ఎన్నికల ఓటమి పుండు మీద కారం చల్లడంతో మరింత సైలెంట్ అయ్యారు.
కేసీఆర్ ని కలవాలన్నా ఎర్రవల్లి ఫార్మ్ హౌస్ కి వెళ్లాల్సిందే. ఇక్కడ చిన్న రాజా కేటీఆర్ తో పాటుగా హరీష్ రావు లు BRS లో యాక్టీవ్ గా ఉంటున్నారు తప్ప కేసీఆర్ అలికిడి తగ్గడంతో కేటీఆర్ ని ముఖ్యమంత్రిని చెయ్యడానికే కేసీఆర్ రాజకీయాలకు దూరమవుతున్నారనే వార్తల నేపథ్యంలో కేసీఆర్ ఇప్పుడు ప్రజల్లోకి రాబోతున్నారు.
తెలంగాణ లో స్థానిక ఎన్నికలు సమీపిస్తుండటంతో కేసీఆర్ యాక్టీవ్ అవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఢీ కొట్టేందుకు కేసీఆర్ సింహ గర్జనకు సిద్ధమవుతున్నారు.