బాస్ ఆఫ్ ది మాస్ మెగాస్టార్ చిరంజీవిని మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన లైలా చిత్ర నిర్మాత సాహు గారపాటితో కలిశారు. వారెందుకు కలిశారో ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే. విశ్వక్ సేన్ చేసిన లైలా చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా ఆహ్వానించడానికి విశ్వక్, సాహులు మెగాస్టార్‌ని కలిశారు. వారు ఆల్రెడీ చిరుని సంప్రదించి, ఓకే చేయించుకున్న వెంటనే ఓ ప్రోమో వదిలారు.
ఆ ప్రోమో తర్వాత వారు ప్రత్యేకంగా చిరు ఇంటికి వెళ్లడంతో.. వారు వెళ్లింది లైలా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా ఆహ్వానించేందుకే అని అందరికీ అర్థమైంది. ఈ మీట్‌లో మెగాస్టార్‌కి ఎంతో ఇష్టమైన పంచముఖ హనుమాన్ ప్రతిమను గిఫ్ట్‌గా ఇచ్చి.. బాస్‌కి ఆనందాన్ని కలిగించారు. ఈ ప్రతిమ అందుకున్న మెగాస్టార్ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.
లైలా విషయానికి వస్తే.. మొదటిసారి మాస్ కా దాస్ అమ్మాయిగా- అబ్బాయిగా నటించిన చిత్రమిది. ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకుడు. ఫిబ్రవరి 9న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించేందుకు లైలా టీమ్ ఏర్పాట్లు చేస్తోంది.