Advertisementt

జాక్ టీజర్: కొంచెం కాదు, చాలా ఉంది!

Fri 07th Feb 2025 08:22 PM
jack teaser  జాక్ టీజర్: కొంచెం కాదు, చాలా ఉంది!
Siddhu Jonnalagadda Starring Jack Teaser Released జాక్ టీజర్: కొంచెం కాదు, చాలా ఉంది!
Advertisement
Ads by CJ

టిల్లు సిరీస్ చిత్రాలతో బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపిన సిద్ధు జొన్నలగడ్డ.. నటుడిగా తన రేంజ్‌ని అమాంతం పెంచేసుకున్నాడు. ఇప్పుడు తన నుండి సినిమా వస్తుందంటే చాలా అంతా వేచి చూసేలా చేసుకున్నాడు. ఈ క్రమంలో సిద్ధు జొన్నలగడ్డ నటించిన జాక్- కొంచెం క్రాక్ మూవీ టీజర్‌ని ఆయన పుట్టినరోజైన ఫిబ్రవరి 7న మేకర్స్ వదిలారు.

సిద్ధుకి ఏ జోనర్ అయితే హిట్ ఇచ్చిందో.. అదే జోనర్‌తో ఈ జాక్ కూడా ఉండబోతుందనే విషయాన్ని ఈ టీజర్ తెలియజేస్తుంది. బేబి బ్యూటీ వైష్ణవి చైతన్య ఇందులో సిద్ధుకి జోడీగా నటిస్తుండగా, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా హీరోహీరోయిన్లుకు ఏమోగానీ.. బొమ్మరిల్లు భాస్కర్‌కు మాత్రం కచ్చితంగా హిట్ కావాలి. అందుకే, ఎంటర్‌టైన్‌మెంట్‌కు ప్రాధాన్యతను ఇస్తూనే ఇందులో ఏదో మెసేజ్‌ని లీనం చేశాడనిపించేలా టీజర్‌ తెలియజేస్తుంది.

నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నేతృత్వంలోని అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. ఇందులో నరేష్, ప్రకాష్ రాజ్, బ్రహ్మాజీ వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు.

Siddhu Jonnalagadda Starring Jack Teaser Released:

Siddhu Jonnalagadda Starring Jack Teaser Talk

Tags:   JACK TEASER
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ