ఈటీవీలో ప్రతి మంగళవారం రాత్రి 9.30కి ప్రసారమయ్యే సుమ అడ్డా ఈ వారం ఎపిసోడ్‌కి లైలా టీమ్ హాజరయ్యింది. హీరో విశ్వక్ సేన్, సుమని ఓ ఆట ఆడుకోవడం కాదు.. సుమ కూడా విశ్వక్ అండ్ టీమ్‌ని ఆడించేసింది. ఈ షో లో విశ్వక్ సేన్ బాలయ్యతో కలిసి ఉన్న ఫోటోలను చూపించగానే.. అవును కలిసి కాఫీ తాగాం అన్నాడు విశ్వక్ సేన్.
దానికి సుమ ఏ కాఫీ అంటూ కాస్త కామెడీ చేసింది. విశ్వక్‌కు, సిద్దు జొన్నలగడ్డకు బాలయ్య ముద్దులు పెడుతున్న వీడియోని ప్లే చేశారు. బాలయ్య బాబు క్లోజ్ అనగానే.. విశ్వక్ సేన్ చేత సుమ బాలయ్యకు ఫోన్ చేయించగా.. సుమ నే చేయించింది అని బాలయ్యకు చెబుతా అంటూ ఫోన్ చేసిన విశ్వక్ కు సుమకు బాలయ్య షాకిస్తూ ఫోన్ లిఫ్ట్ చేసిన ప్రోమో వైరల్ అయ్యింది.
మరి బాలకృష్ణ విశ్వక్‌తో ఈ షోలో ఏం మాట్లాడారు అనేది పూర్తి ఎపిసోడ్ వస్తేగానీ తెలియదు. అంటే వచ్చే మంగళవారం వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ షో లో లైలా మూవీకి సంబంధించి చాలా విషయాలను లైలా టీమ్ పంచుకుంది.