చాలామంది సౌత్ హీరోలకు నార్త్ కి వెళ్లి హిట్ కొట్టాలనే కసి ఉంటుంది. అందులోను పాన్ ఇండియా మార్కెట్ ని తెలుగు హీరోలు దున్నేస్తుంటే.. యంగ్ హీరోలకు పాన్ ఇండియా మార్కెట్ పై కన్ను పడింది. గతంలో నిఖిల్ సైలెంట్ గా కార్తీకేయ 2 తో పాన్ ఇండియా హిట్ కొట్టేసాడు. తర్వాత విజయ్ దేవరకొండ, నాని లాంటి వాళ్ళు పాన్ ఇండియా మార్కెట్ లో అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ వర్కౌట్ అవ్వలేదు.
రీసెంట్ గా కిరణ్ అబ్బవరం కూడా క చిత్రంతో పాన్ ఇండియా మార్కెట్ లోకి వెళ్ళొచ్చాడు. అతనికి పెద్దగా పని జరగలేదు. ఇప్పుడు నాగ చైతన్య తండేల్ తో పాన్ ఇండియాకి ఎంట్రీ ఇస్తున్నాడు. చందు మొండేటి కార్తికేయ 2 తో పాన్ ఇండియా హిట్ కొట్టడంతో తన తదుపరి సినిమా తండేల్ ను కూడా పాన్ ఇండియా మార్కెట్ లోకి దించుతున్నారు.
ప్రమోషన్స్ పరంగా చెన్నై, ముంబై అంటూ అక్కడో ప్రెస్ మీట్ ఇక్కడో ప్రెస్ మీట్ పెట్టేసారు. మరి తండేల్ కథ పాన్ ఇండియా ఆడియన్స్ కు ఎంతవరకు రీచ్ అవుతుంది, నాగ చైతన్య కి తండేల్ పెద్ద పరీక్షలానే మారింది. మరి ఈ పరీక్షను నాగ చైతన్య గట్టెక్కుతాడా, లేదా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.