నందమూరి మోక్షజ్ఞ గత ఏడాదే హీరోగా లాంచ్ అవుతాడని అభిమానులు కలలు కన్నారు. కారణం గత ఏడాది మోక్షజ్ఞ బర్త్ డే స్పెషల్ గా ఫస్ట్ లుక్ తో డెబ్యూ పోస్టర్ వదిలారు. ప్రశాంత్ వర్మ దర్శకుడిగా చెరుకూరి సుధాకర్ తో కలిసి నందమూరి తేజస్వి ఈ చిత్రానికి నిర్మాతలుగా అంటూ గ్రాండ్ గా ప్రకటించారు. ఆతర్వాత ఈప్రాజెక్టు ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
మధ్యలో ప్రశాంతవర్మతో విభేదాలనే టాక్ నడిచింది, ఆతర్వాత మేకర్స్ ప్రెస్ నోట్ వదిలారు. మోక్షజ్ఞ నట శిక్షణ పూర్తయ్యింది. కానీ సెట్స్ లోకి మాత్రం రావడం లేదు. మోక్షజ్ఞ డెబ్యూ ఆగిపోయింది అనే వార్తలపై మోక్షజ్ఞ కూడా కాస్త చిరాగ్గానే ఉన్నాడట. అభిమానులను వెయిట్ చేయిస్తున్నానే టెన్షన్ తో మోక్షజ్ఞ కనిపిస్తున్నాడు అంటున్నారు.
రీసెంట్ గా బాలకృష్ణకు పద్మ భూషణ్ వచ్చిన సందర్భంలో చెల్లి నారా భువనేస్వరి ఇచ్చిన పార్టీలోనూ మోక్షజ్ఞ కనిపించలేదు. మోక్షు కూడా డెబ్యూ మూవీ ఇలా అవ్వడమేమిటో అర్ధం కాక సఫర్ అవుతున్నాడేమో అనే ఆందోళనలో నందమూరి అభిమానులు కనిపిస్తున్నారు.