వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన మాజీ మంత్రి విడుదల రజిని పాపాల చిట్టా ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. గత ప్రభుత్వంలో అధికార అండ చూసుకుని రజిని అనుచరులు చేసిన అరాచకాలకు కూటమి ప్రభుత్వం బదులు ఇచ్చేపనిలో ఉండగానే హైకోర్టు రజినీకి షాకిచ్చింది.
మాజీ మంత్రి విడదల రజినిపై కేసు నమోదుకు హైకోర్టు ఆదేశం.
2019లో సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నాడని చిలకలూరిపేట కు చెందిన పిల్లి కోటి అనే వ్యక్తిని చిత్రహింసలు పెట్టారని ఆరోపణ.
చిలకలూరిపేట పీఎస్‌లో ఐదు రోజుల పాటు చిత్రహింసలు పెట్టారని ఆరోపణ.
ఇటీవల పలుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నేత పిల్లి కోటి.
న్యాయం జరగకపోవడంతో హైకోర్టును ఆశ్రయించిన పిల్లి కోటి.
మాజీ మంత్రి విడదల రజినితో పాటు ఆమె పీఏలు రామకృష్ణ, ఫణి, అప్పటి సీఐ సూర్యనారాయణపై కేసు నమోదుకు హైకోర్టు ఆదేశాలు.
రెండు వారాల్లోగా కేసు నమోదు చేసి వివరాలు ఇవ్వాలని పల్నాడు పోలీసులకు ఏపీ హైకోర్టు ఆదేశం.