పూజ హెగ్డే కు తెలుగులో మంచి మంచి హిట్స్ వచ్చినా అలా వైకుంఠపురంలో పూజ హెగ్డే కు బిగ్ బ్రేక్ ఇచ్చింది. ఆతర్వాత పూజ హెగ్డే కు వరసగా మూడు భాషల్లో నిరాశ పరిచే బిగ్ డిజాస్టర్స్ రావడంతో అమ్మడు గత రెండేళ్లుగా లైమ్ టైమ్ లో లేకుండా పోయింది. ప్రస్తుతం మెల్లగా బిజీ అవుతున్నపూజ హెగ్డే రీసెంట్ గా దేవా చిత్రంలో హిందీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
దేవా ప్రమోషన్స్ లో భాగంగా పూజ హెగ్డే చేసిన కామెంట్స్ వైరల్ అవడం కాదు.. అల్లు ఫ్యాన్స్ ను ఆగ్రహానికి గురి చేసింది. పూజ హెగ్డే మాట్లాడుతూ.. సౌత్ లో తాను నటించిన అల వైకుంఠపురములో తమిళ్ మూవీ అయినా కూడా హిందీ ఆడియెన్స్ దానిని పాన్ ఇండియా మూవీగా ఆదరించారని.. వర్క్ బాగుంటే, అది ఆడియన్స్ కు నచ్చుతుందని పూజ హెగ్డే ఫ్లోలో మాట్లాడేసింది.
అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అలా వైకుంఠపురములో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వగా.. దానిని పూజ హెగ్డే తమిళ్ మూవీ అనడం, తనకు అంత మంచి హిట్ ఇచ్చిన సినిమా ఏ భాషలో తెరకెక్కిందో కూడా పూజ హెగ్డే మరిచిపోయిందా అంటూ అల్లు అభిమానులు పూజ హెగ్డే పై ఫైర్ అవుతున్నారు.