కోలీవుడ్ స్టార్ హీరో అజిత్-త్రిష జంటగా నటించిన చిత్రం విడాముయర్చి తెలుగులో పట్టుదలగా విడుదల కాబోతుంది. రేపు గురువారమే తెలుగు ఆడియన్స్ ముందుకు పట్టుదలగా రాబోతున్న ఈ చిత్రం బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. బుక్ మై షోలో లో పట్టుదల చిత్రానికి వసున్న బుకింగ్స్ మేకర్స్ కి షాకిస్తున్నాయి. అంత దారుణమైన బుకింగ్స్ కనిపిస్తున్నాయి.
ఎలాంటి బజ్ లేకుండా పట్టుదల విడుదలవుతుంది. అజిత్ కానీ, మేకర్స్ కానీ తెలుగులో ప్రెస్ మీట్ పెట్టలేదు. అజిత్ సినిమాలు వరసగా తెలుగులో ఫెయిల్ అవుతున్నాయి. దాంతో తెలుగు ప్రేక్షకుల్లో పట్టుదలపై ఆసక్తి లేకుండా పోయింది. అందుకే బుకింగ్స్ అంత వీక్ గా వున్నాయి అంటున్నారు.
అసలే మరొక్క రోజులో తండేల్ తో నాగ్ చైతన్య దిగబోతున్నాడు. పట్టుదలకు హిట్ టాక్ వచ్చినా తండేల్ తో పోటీ పట్టుదల కలెక్షన్స్ కు డ్యామేజ్ అవ్వడం మాత్రం గ్యారెంటీ గా కనిపిస్తుంది.