లేడీ సూపర్ స్టార్ నయనతార కన్నడ స్టార్ హీరో యష్ టాక్సిక్ లో నటిస్తుంది అనే విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించకపోయినా.. అందులో నటిస్తున్న ఓ నటుడు నయన్ విషయం కన్ ఫర్మ్ చేసారు. టాక్సిక్ మూవీలో కియారా అద్వానీ యష్ కి హీరోయిన్ గా నటిస్తుండగా.. నయనతార, బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషీలు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
రీసెంట్ గా ముంబై షెడ్యూల్ ని నెల రోజుల పాటు దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించగా.. ఈ షెడ్యూల్ విషయంలో యష్ అసంతృప్తిగా ఉన్నాడని, ఆ నెల రోజుల చిత్రీకరణ వృధా అనే వార్తలు వినిపించాయి. అదలావుంటే ఇప్పడు బెంగుళూరులో టాక్సిక్ నాలుగో షెడ్యూల్ కి ప్లాన్ చేసారు.
ఈ షెడ్యూల్ లోనే నయనతార టాక్సిక్ సెట్స్ లోకి అడుగుపెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. నయన్ మాత్రమే కాదు హ్యూమా ఖురేషి కూడా బెంగుళూరు షెడ్యూల్ లోనే జాయిన్ అవ్వబోతుంది. ఈ షెడ్యూల్ లో కీలక పాత్రలో ప్రధాన సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలుస్తోంది.