టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పైకి నవ్వుతున్నారు కానీ.. లోపల ఆయన ఐటి దాడుల విషయంలో నలిగిపోతున్నారంటూ కొంతమంది గుసగుసలాడుకుంటున్నారు. గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నా చిత్రాల విడుదల తర్వాత ఐటి అధికారులు దిల్ రాజు ఆయన కుటుంబీకుల ఇళ్లు, ఆఫీసులపై నాలుగురోజుల పాటు దాడులు చేసి సోదాలు నిర్వహించారు.
దిల్ రాజు ఇంటిపై ఐటి అధికారుల సోదాల సమయంలో ఆయన తన ఇంటి నుంచి బయటికి రాలేదు. ఆఖరుకు ఐటి అధికారుల కారులోనే ఆయన SVC ఆఫీస్ కి కూడా వెళ్లారు. ఆతర్వాత ఆయన రెండు మూడు సినిమా ఈవెంట్స్ లో కనిపించడమే కాదు, ఐటి దాడులను తేలిగ్గా కొట్టిపారేశారు. ఆ వెంటనే భార్య కొడుకుతో కలిసి చైనా వెకేషన్ కు వెళ్లొచ్చారు.
ఈరోజు మరోసారి దిల్ రాజు తన ఆడిటర్ తో కలిసి ఐటి కార్యాలయం కు వెళ్లారు. రెండు గంటలపాటు దిల్ రాజ్ ని విచారించిన ఐటి శాఖ అధికారులు.ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండాలని ఐటీ అధికారులు దిల్ రాజుకు చెప్పినట్లుగా తెలుస్తోంది. మరి ఇదంతా చూస్తే దిల్ రాజు పైకి నవ్వుతున్నారు కానీ.. లోపల మాత్రం కాస్త టెన్షన్ పడుతున్నట్లే ఉంది వ్యవహారం అంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.