కోలీవుడ్ హీరోలు తమ సినిమాలను తెలుగులో రిలీజ్ చేస్తారు కానీ ఆ సినిమాలను ప్రమోట్ చేసేందుకు మాత్రం తెలుగు గడ్డపై అడుగుపెట్టరు. కమల్, ధనుష్, విజయ్ సేతుపతి, సూర్య, కార్తీ, విశాల్ ఇలా కొంతమంది హీరోలు మాత్రమే తమ సినిమాలను విడుదల చేసే తెలుగునాట కూడా ప్రమోట్ చేస్తారు.
విజయ్, అజిత్ లాంటి వాళ్ళు మాత్రం తమ సినిమాలను ప్రమోట్ చేసేందుకు తెలుగు ప్రేక్షకుల ముందుకు రారు. అక్కడ తమిళనాట కూడా అజిత్ ప్రమోషన్స్ లో కనిపించడు, విజయ్ అయితే ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనో కనిపిస్తాడు తప్ప మిగతా చోట్ల ఎలాంటి ప్రమోషన్స్ పెట్టుకోడు. కానీ సినిమాలను తమిళంతో పాటుగా తెలుగులోను భారీగా విడుదల చేస్తారు.
ప్రమోషన్స్ చెయ్యరు, తెలుగు ప్రేక్షకులు అంటే చిన్న చూపో, లేదంటే తీరిక ఉండదో కానీ.. తెలుగునాట కొంతమంది తమిళ హీరోలు ప్రమోషన్స్ ను లైట్ తీసుకుంటారు. తాజాగా అజిత్ సినిమా పట్టుదల ఫిబ్రవరి 6 అంటే రేపు గురువారం విడుదల కాబోతుంది. అజిత్ కానీ, మేకర్స్ కానీ ఎలాంటి ప్రెస్ మీట్ పెట్టలేదు.
ఇక్కడ కలెక్షన్స్ కావాలి కాని, తెలుగు ప్రేక్షకులను పట్టించుకోరా, తెలుగు ప్రేక్షకులు అంటే అంత అలుసా అని అందరూ మాట్లాడుతున్నారు.