Advertisementt

బాలయ్య బరిలోకి దిగితే గెలుపు దక్కాల్సిందే!

Mon 03rd Feb 2025 12:28 PM
hindupur  బాలయ్య బరిలోకి దిగితే గెలుపు దక్కాల్సిందే!
If Balayya enters the ring- he should win బాలయ్య బరిలోకి దిగితే గెలుపు దక్కాల్సిందే!
Advertisement
Ads by CJ

హిందూపురం నియోజకవర్గం నుంచి మూడుసార్లు వరసగా ఎమ్యెల్యేగా గెలిచి హ్యాట్రిక్ ఎమ్యెల్యేగా మారిన నందమూరి బాలకృష్ణని మరోసారి  హిందూపురం నియోజకవర్గంలో విజయం వరించింది. బాలయ్య బరి లోకి దిగారు, హిందూపురం మున్సిపాలిటీని టీడీపీ సొంతమైంది. హిందూపురంలో వైసీపీ కి చుక్కలు కనిపించాయి. 

ఈరోజు జరిగిన హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి రమేష్ కుమార్ విజయం సాధించారు. ఇప్పటివరకు అక్కడ వైసీపీ అభ్యర్థికి అత్యధికంగా 23 మంది కౌన్సిలర్లు ఉన్నా.. వారు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. చాలామంది వైసీపీ పార్టీ నుంచి టీడీపీ లో చేరిపోవడంతో మున్సిపాలిటీ ఎలెక్షన్ కన్నా ముందే టీడీపీ కి విజయం ఖాయమైంది. 

వైసీపీ కి చెందిన కౌన్సిలర్లు మొత్తం టీడీపీ లోకి చేరడంతో రమేష్ కుమార్ కు ఇరవై మూడు ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి కేవలం సింగిల్ డిజిట్ తో సరిపెట్టుకోగా.. ఈ విజయాన్ని బాలయ్య ఖాతాలో వేస్తున్నారు. అధికార పార్టీకే మున్సిపల్ చైర్మన్ హోదా వస్తుంది. అందులో విచిత్రమేమి లేకపోయినా.. బాలయ్య అభిమానులు మాత్రం పండగ చేసుకుంటున్నారు. 

If Balayya enters the ring- he should win:

TDP Secures Hindupur Municipality - Wins Deputy Mayor

Tags:   HINDUPUR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ