డిసెంబర్ 5 నాగ చైతన్యను వివాహం చేసుకుని అక్కినేని ఇంటికోడలిగా అడుగుపెట్టిన హీరోయిన్ శోభిత దూళిపాళ్ల ప్రొఫెషనల్ గా ఎలా ఉన్నా అంటే గ్లామర్ డ్రెస్సులతో కనిపించినా ఆమె ఫ్యామిలీ ఈవెంట్స్ కి వచ్చేసరికి పద్దతిగా చీరకట్టులో కనిపిస్తుంది. పెళ్లి కూడా శోభిత తమ పేరెంట్స్ ఇష్టప్రకారమే బ్రాహ్మణ సాంప్రదాయ పద్దతిలో నాగ చైతన్య తో తాళి కట్టించుకుంది.
కానీ ప్రొఫెషనల్ గా శోభిత దూళిపాళ్ల మాత్రం చాలా గ్లామర్ గా ట్రెండీ గా కనిపిస్తుంది. ఇక పెళ్లి తర్వాత వచ్చిన పెద్ద పండుగ సంక్రాంతికి నాగ చైతన్యతో కలిసి శోభిత దూళిపాళ్ల ట్రెడిషనల్ గా, తెలుగింటి ఆడపడుచులా అందంగా రెడీ అయ్యి భర్త తో కలిసి ఫొటోలకి ఫోజులిచ్చింది.
పెళ్లి తర్వాత మొదటి సంక్రాంతి కి శోభిత - నాగ చైతన్యలు లాల్చీ పైజామా-చీరకట్టులో అభిమానులను అలరించారు. ఈ కొత్త జంట కు అక్కినేని అభిమానులు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.