దేవర చిత్రం తో సౌత్ లోకి ఎంట్రీ ఇచ్చి బ్యాక్ టు బ్యాక్ మరో స్టార్ హీరో రామ్ చరణ్ తో RC 16 అవకాశం అందుకున్న జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో సెగలు పుట్టించే గ్లామర్ డ్రెస్సులతో అదరగొట్టేస్తుంది. మోడ్రెన్ కి కేరాఫ్ గా నిలిచే జాన్వీ కపూర్ అందాలు ఆరబోసేందుకు ఎప్పడూ సిద్దమే.
తాజాగా ఈ పాప క్రిస్టమస్ ట్రీ పక్కన నించుని ఇచ్చిన ఫోజులకు యూత్ మొత్తం ఫిదా అవ్వాల్సిందే. చిట్టిపొట్టి డ్రెస్ లో క్రిస్టమస్ ట్రీ పక్కనే జాన్వీ కపూర్ రకరకాల ఫోజులిచ్చింది. మేకప్ వేసుకుంటూ, సరదాగా నవ్వుతూ జాన్వీ కపూర్ ఇచ్చిన ఫోజులు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఇక 2025 నుంచి జాన్వీ కపూర్ RC 16 సెట్స్ లోకి అడుగుపెట్టనున్నట్లుగా తెలుస్తోంది. ఈలోపు చరణ్ గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ ఫినిష్ చేసేసి సంక్రాంతి తర్వాత బుచ్చిబాబు కి అందుబాటులోకి వస్తారని టాక్ ఉంది.