ప్రస్తుతం రామ్ చరణ్ యుఎస్ వెళ్ళబోతున్నారు. ఆయన అమెరికా డల్లాస్‌లో జరగబోయే గేమ్ ఛేంజర్ ఈవెంట్ కోసం వెళ్ళబోతున్నారు. అందుకే బుచ్చిబాబు RC 16 షూటింగ్ కి చిన్న బ్రేక్ ఇచ్చాడు. రామ్ చరణ్ గత 20 రోజులుగా బుచ్చిబాబు తో RC 16 సెట్స్ లోనే కష్టపడుతున్నారు. అయితే ఇప్పడు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ కోసం కొంతకాలం RC 16 షూటింగ్ కి బ్రేకివ్వాల్సి వస్తోంది.
మరోపక్క రామ్ చరణ్ కి విలన్ గా RC 16 లో నటించబోయే శివ రాజ్ కుమార్ కూడా అందుబాటులో ఉండడం లేదు. బుచ్చి బాబు ఈ ప్రాజెక్టు ప్రకటించినప్పుడే ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ నటిస్తున్నారని ప్రకటించారు. అయితే ఇప్పుడు శివ రాజ్ కుమార్ హెల్త్ రీజన్స్ వలన అమెరికా వెళ్లారు.
అక్కడ మియామి క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్‌లో శివ రాజ్ కుమార్ కు డిసెంబర్ 24న సర్జరీ జరగబోతోంది. ఈ విషయమై స్పందిస్తూ.. తాను మామూలుగానే ఎంతో ధైర్యంగా, పాజిటివ్‌గా ఉంటానని, కానీ ఇంటి నుంచి వస్తుంటే ఫ్యామిలీ మెంబర్లు అంతా ఎమోషనల్ అయ్యారని, అది చూసి తాను కూడా కాస్త ఎమోషనల్ అయ్యానని, నెల రోజులకు పైగా ఇంటికి దూరంగా ఉండబోతోన్నానని, ఇన్ని రోజులు ఇలా ఉండటం ఇదే ఫస్ట్ టైమ్ అని చెప్పారు.
ఇప్పుడు అమెరికా వెళ్లిన ఆయన మళ్లీ జనవరి 26న ఇండియాలో అడుగు పెడతారని, అమెరికా నుంచి తిరిగొచ్చాకా కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని సినిమా షూటింగ్‌లో పాల్గొంటానని తెలిపినట్లుగా తెలుస్తోంది. ఆ లెక్కన రామ్ చరణ్ RC 16 లోకి అడుగుపెట్టాలంటే కాస్త సమయం అయితే పడుతుంది. అప్పటి వరకు ఆయన లేని సీన్లు షూట్ చేస్తారేమో.. రామ్ చరణ్ వెయిట్ చేయక తప్పదు.