Advertisementt

మళ్ళీ ముంబై కి ఎన్టీఆర్

Thu 07th Nov 2024 11:57 AM
war 2  మళ్ళీ ముంబై కి ఎన్టీఆర్
NTR to Mumbai again మళ్ళీ ముంబై కి ఎన్టీఆర్
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మళ్లీ ముంబై ఫ్లైట్ ఎక్కారు. దీపావళి ముందు రోజు ముంబై నుంచి హైదరాబాద్ వచ్చిన ఎన్టీఆర్ ఇక్కడ తన ఇంట్లో దీపావళి కి పార్టీ ఇచ్చిన ఎన్టీఆర్, ఆతర్వాత గత ఆదివారం తన బావమరిది నార్నె నితిన్ నిశ్సితార్ధంలో ఫ్యామిలీతో కలిసి సందడి చేసారు. కొడుకులు, భార్య ప్రణతి తో కలిసి ఎన్టీఆర్ చాలా హైలెట్ అయ్యారు. 

హైదరాబాద్ లో పనులు ముగించుకుని ఎన్టీఆర్ మళ్ళీ ముంబై కి పయనమయ్యారు. ముంబైలో వార్ 2 తదుపరి షెడ్యూల్ లో పాల్గొనేందుకు ఎన్టీఆర్ వెళ్లిపోయారు. హృతిక్ రోషన్ హీరోగా అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న హిట్ ప్రాంచైజీ వార్ 2లో ఎన్టీఆర్ కీలకంగా కనిపించబోతున్నారు. 

ప్రస్తుతం వార్ 2 క్లైమాక్స్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్-హృతిక్ రోషన్ మధ్యలో యాక్షన్ సన్నివేశాలను పూర్తి చేస్తే ఎన్టీఆర్ ఫ్రీ అవుతారు. ఆతర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ సెట్స్ లోకి అడుగుపెడతారు. 

NTR to Mumbai again:

Jr NTR To Resume Shooting For Hrithik Roshan War 2

Tags:   WAR 2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ