Advertisementt

పుష్ప 1 సీన్ పుష్ప 2 కు రిపీట్ కాబోతుంది

Thu 07th Nov 2024 09:57 AM
pushpa 2  పుష్ప 1 సీన్ పుష్ప 2 కు రిపీట్ కాబోతుంది
Pushpa 1 scene is going to be repeated for Pushpa 2 పుష్ప 1 సీన్ పుష్ప 2 కు రిపీట్ కాబోతుంది
Advertisement
Ads by CJ

పుష్ప పార్ట్ 1 చిత్రాన్ని పాన్ ఇండియా మార్కెట్ లో విడుదల చెయ్యాలని అనుకున్నారు కానీ.. ఆ చిత్రాన్ని పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లేందుకు సుకుమార్ అండ్ టీమ్ కి కావాల్సిన సమయం లేదు. సుకుమార్ పుష్ప 1 పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో తలమునకలై ఉంటే అల్లు అర్జున్, రష్మిక లు సినిమాను చెన్నై నుంచి బెంగుళూరు వరకు ప్రమోట్ చేసారు. 

ఎంత హడావిడిగా పుష్ప 1 ప్రమోషన్స్ చుట్టేసినా.. సినిమా విడుదలయ్యాక దానికొచ్చిన టాక్ పుష్ప 1ను భారీ కలెక్షన్స్ వైపు నడిపించింది. ఇప్పుడు పుష్ప 1 ప్రమోషన్స్ సీన్ మరోసారి పుష్ప 2 కు కూడా రిపీట్ అయ్యేలా ఉంది. కారణం సినిమా విడుదల కావడానికి నెల సమయం ఉంది. కానీ ఇప్పటివరకు సాంగ్ షూట్ అవ్వలేదు. నవంబర్ 20 కి ఫైనల్ అవుట్ ఫుట్ ఇచ్చేస్తానని సుకుమార్ మాటిచ్చారు. కానీ ఇప్పటికీ కొన్ని పనులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ నెల రెండో వారానికి షూటింగ్ పూర్తయినా పోస్ట్ ప్రొడక్షన్ అంటూ మళ్ళీ సుకుమార్ కి నిద్రలేని రాత్రులే. 

అలాంటప్పుడు సుకుమార్ మీడియా ముందుకు రాలేరు. మళ్ళీ అల్లు అర్జున్, రష్మిక.. ఈసారి సెకండ్ పార్ట్ లో కీలకమైన ఫహద్ ఫాసిల్ లు పుష్ప 2 ని ప్రమోట్ చెయ్యడానికి పాన్ ఇండియా మార్కెట్లో తిరుగుతారేమో అనే ఊహాగానాలు కాదు నిజాలే కనిపిస్తున్నాయి. మరి పుష్ప 1 సేమ్ సీన్ ఇప్పుడు రిపీట్ అవడం అయితే పక్కా.! 

Pushpa 1 scene is going to be repeated for Pushpa 2:

Pushpa 2 promotions update 

Tags:   PUSHPA 2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ