రేపు విజయదశమి సందర్భంగా మెగా-నందమూరి సినిమాలపై క్లారిటీ రాబోతుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభర అసలు సంక్రాంతికి వస్తుందా, రాదా అనేది రేపు మేకర్స్ టీజర్ తో క్లారిటీ ఇవ్వబోతున్నారు. విశ్వంభర చిత్రం మొదలవ్వకముందే అనౌన్సమెంట్ రోజే జనవరి 10 సంక్రాంతికి రిలీజ్ అన్నారు. ఈమధ్యన విశ్వంభర సంక్రాంతికి రాదు, మార్చ్ కి షిఫ్ట్ అవ్వబోతుంది అంటున్నారు.
మరి రేపు విజయదశమి సందర్భంగా వదలబోతున్న విశ్వంభర టీజర్ తో ఏమైనా రిలీజ్ డేట్ మార్పు విషయమై క్లారిటీ వస్తుందేమో చూడాలి. ఇక అదే సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ NBK 109 తో రాబోతున్నారు, జనవరి 12 న NBK 109 రిలీజ్ ఉండొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి.
తాజాగా NBK 109 నిర్మాత నాగ వంశి NBK109 దీపావళి కి టైటిల్, టీజర్.. ఇస్తాము, రేపు విజయదశమి సందర్భంగా NBK 109 రిలీజ్ డేట్ ప్రకటిస్తామని ఓ ఈవెంట్ లో నాగవంశీ ప్రకటించారు. మరి విజయదశమి రోజే మెగాస్టార్ చిరు-నందమూరి నటసింహ బాలయ్య సినిమాల విడుదల తేదీలపై స్పష్టత రాబోతుంది.