కోలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ పెళ్లి కొడుకులు ఇద్దరు కనిపిస్తారు. అందులో ఒకరు శింబు, రెండో హీరో విశాల్. ఒకసారి వరలక్ష్మి శరత్ కుమార్ తో బ్రేకప్ అయ్యాక విశాల్ అనూష రెడ్డితో నిశ్సితార్ధం చేసుకుని బ్రేకప్ చేసుకున్నాడు. ఇక మరో హీరో శింబు గురించి కోలీవుడ్ మీడియా లో వచ్చిన కథనాలు, మరే ఇతర హీరోపై రాలేదు అనే చెప్పాలి.
శింబు గతంలో నయనతార, హన్సిక ఇలా చాలామంది హీరోయిన్స్ తో డేటింగ్ చేసాడు, కానీ పెళ్లి వరకు వెళ్ళలేదు అని కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరిగింది. శింబు ఏ హీరోయిన్ తో కలిసి నటించినా ఆ హీరోయిన్ ని ప్రేమలో పడేస్తాడని చెప్పుకుంటారు. ప్రస్తుతం సింగిల్ గా కనిపిస్తున్నా శింబు మరో హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడనే వార్త ఎప్పటినుంచో వినిపిస్తుంది.
ఆమె ఎవరో కాదు నిధి అగర్వాల్. శింబు నిధి అగర్వాల్ తో డేటింగ్ చెయ్యడమే కాదు త్వరలోనే నిధి అగర్వాల్ తో పెళ్లి పీటలెక్కబోతున్నాడు, శింబు పేరెంట్స్ శింబు-నిధి అగర్వాల్ పెళ్ళికి ముహుర్తాలు పెట్టించబోతున్నారనే వార్త మాత్రం కోలీవుడ్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.