Advertisementt

కొడాలి నాని గుడ్ బై.. వారసుడొస్తున్నాడు!

Sun 11th Aug 2024 07:55 PM
jagan  కొడాలి నాని గుడ్ బై.. వారసుడొస్తున్నాడు!
Kodali Nani Permanent Goodbye to Politics? కొడాలి నాని గుడ్ బై.. వారసుడొస్తున్నాడు!
Advertisement

రాజకీయాలకు జగన్ రైట్ హ్యాండ్ గుడ్ బై!!

కొడాలి నాని.. రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నారా..? 2024 ఎన్నికలే చివరి ఎన్నికలు అని చెప్పిన అనుకున్నట్టే దూరం అవుతున్నారా..? అప్పుడెప్పుడో ఎన్నికల ఫలితాల తర్వాత హడావుడి చేసిన నాని ఇక పూర్తిగా వద్దు అనుకుంటున్నారా..? వారసుడిని త్వరలో పరిచయం చేస్తున్నారా..? అంటే తాజా పరిణామాలు, గుడివాడ నియోజకవర్గ ప్రజలు చెబుతున్న మాటలను బట్టి చూస్తే అక్షరాలా నిజం అనిపిస్తోంది. ఇంతకీ కొడాలి నిర్ణయం వెనుక అంతలా ఏం జరిగింది..? ఈ పరిస్థితికి దారితీసిన పరిణామాలు ఏంటి..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి..!

ఓరి దేవుడా.. ఏంటిది..!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా ఓడిపోయి.. క్రికెట్ టీంకు పరిమితం అయిన తర్వాత వైసీపీ రెక్కలు ఊడిపోతున్నాయ్..! వికెట్లు టపీటపీమని వరుసగా పడిపోతున్నాయ్..! ఊహించని రీతిలో వైసీపీలో చిత్ర విచిత్రాలు అన్నీ జరుగుతున్నాయ్..! ఎప్పుడు ఎవరు పార్టీకి గుడ్ బై చెబుతారో.. ఎవరు రాజకీయాలకు రాం.. రాం చెబుతారో తెలియక హైకమాండ్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది..! వైసీపీ స్థాపించిన నాటి నుంచి పార్టీకి వెన్నుదన్నుగా, వైఎస్ జగన్ రెడ్డికి అత్యంత ఆప్తులుగా, కుడి.. ఎడమ భుజములుగా ఉన్న నేతలంతా ఒక్కొక్కరుగా వీడుతుందటంతో ఏంటి పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందని కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. ఒక్క మాటలో చెప్పాలంటే పార్టీ పరిస్థితి దినదినగండంగా ఉందని నేతలంతా గుడ్ బై చెబుతున్నారని కొందరు చెబుతుంటే.. జగన్ తీరు నచ్చకనే పార్టీ సర్వ నాశనం అవుతొందని మరికొందరు చెబుతున్న మాటలు. దేవుడా.. ఎట్టా ఉండే పార్టీ ఇట్టా తయారయ్యింది ఏంటబ్బా అని రాజకీయ విశ్లేషకులే ఆశ్చర్యపోతున్న పరిస్థితి. 

కలలో కూడా..!

కొడాలి నాని.. వైఎస్ జగన్ రైట్ హ్యాండుగా ఉన్న మనిషి. ఒకానొక సందర్భంలో నా కోసం ప్రాణాలు ఇచ్చే మనిషి.. అత్యంత ఆప్తుడు నాని అని అసెంబ్లీ వేదికగా జగన్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి. కొడాలి కూడా అంతే అధినేత అంటే పడి చచ్చేంతగా ఇష్టపడతారు.. ఆయన మీద ఈగ వాలినా సరే యుద్ధం చేసే మనిషి. టీడీపీకి గుడ్ బై చెప్పి.. వైసీపీలోకి వచ్చింది మొదలుకుని నిన్నా మొన్నటి వరకూ జగన్ రెడ్డిని పొల్లెత్తు మాట అంటే చాలు ఒంటి కాలిపై లేచేవారు. అలాంటిది ఇకపై నాని వాయిస్ వినిపించదు.. వైసీపీకి రాజీనామా చేయడమే కాదు, రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేస్తున్నారనే ప్రచారం గుడివాడ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నడుస్తోంది. ఇందుకు కారణం ఆయన అనారోగ్యం, వైసీపీ అధికారంలో ఉండగా కొడాలి రెచ్చిపోయిన తీరే అని చెప్పుకుంటున్నారు. దీనికి తోడు నాని కూడా ఎక్కడా కనిపించలేదు.. వినిపించలేదు.. ఇవి ఆ వార్తలకు మరింత బలం చేకూరేలా చేస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజం ఐతే మాత్రం ఇది గుడివాడ ప్రజలు.. అభిమానులు, కార్యకర్తలు.. ఆఖరికి వైఎస్ జగన్ కలలో కూడా ఊహించనీ పరిణామమే అవుతుంది.

నా వల్ల కాదు.. వారసుడు!

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో విర్రవీగిన ఒక్కొక్కరి తాట తీస్తున్నారు సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, పవన్ కళ్యాణ్..! ఎవరో ఎందుకు వైసీపీతో అంటకాగిన చిన్న స్థాయి అధికారులు మొదలుకుని ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వరకూ చుక్కలు చూస్తున్నారు. ఇక వైసీపీలో ఐతే వల్లభనేని వంశీ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మంత్రిగా ఉన్నప్పుడు కొడాలి నాని చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.. ఒకవైపు నోటికి పని చెప్పి టీడీపీ నేతలు మొదలుకుని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్.. ఇలా ఏ ఒక్కరినీ వదలకుండా పచ్చి బూతులు మాట్లాడారు. అప్పట్లో ఈయనకు బూతు మంత్రి అనే పేరు వచ్చిందంటేనే అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ ఒక ఎత్తయితే ఈయన ఆడిందే క్యాసినో.. పాడిందే గడ్డం గ్యాంగ్ చేష్టలు అన్నట్లుగా ఎమ్మెల్యేగా.. మంత్రిగా ఉన్నన్ని రోజులు సాగించారు. సీన్ మాట చేస్తే.. ఇప్పటికే కొందరు గడ్డం గ్యాంగ్ సభ్యులు అరెస్ట్ కాగా.. మరికొందరు అడ్రెస్స్ లేకుండా పోయారు. రేపో మాపో నాని వంతు రావొచ్చని గుడివాడలో గట్టిగానే చర్చ జరుగుతోంది. అసలే ఆరోగ్య సమస్యలు, దీనికి తోడు కేసుల మోత.. ఇక అరెస్ట్ అయ్యే పరిస్థితి వస్తే ఇజ్జత్ మొత్తం పోతుందని భావించిన కొడాలి.. ఊహించుకుంటేనే అదోలా ఉంది.. ఈ టెన్షన్ పడలేను బాబోయ్ అని రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించినట్లు తెలియవచ్చింది. రాజకీయ వారసుడిగా తన సోదరుడి కుమారుడిని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో నిజానిజాలు ఎంతో తెలియాల్సి ఉంది. ఒకవేళ నిజమైతే మాత్రం అసలే కష్టకాలంలో ఉన్న వైసీపీకి ఇదొక పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. ఏం జరుగుతుందో చూడాలి మరి..!

Kodali Nani Permanent Goodbye to Politics?:

Jagan Right Hand Kodali Nani Goodbye to Politics!!

Tags:   JAGAN
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement