కల్కి విజయం తర్వాత ప్రభాస్ జోరు మాములుగా లేదు. గతంలో చాలా స్లో గా సినిమాలు చేసిన ప్రభాస్ బాహుబలి తర్వాత సాహో, రాధేశ్యామ్ చిత్రాలను కూడా స్లోగా కంప్లీట్ చేసాడు. ప్రభాస్ ఆదిపురుష్ తర్వాత వరస సినిమాలతో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తూ వస్తున్నారు. జూన్ లో ఆదిపురుష్ వస్తే, డిసెంబర్లో సలార్ 1, ఇక ఈ జూన్ లో కల్కి చిత్రంతో అభిమానుల ముందుకు వచ్చేసాడు.
కల్కి తర్వాత మళ్ళీ వచ్చే ఏడాది ఏప్రిల్ కల్లా మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ తో వచ్చేస్తున్నాడు. ప్రస్తుతం రాజా సాబ్ షూటింగ్ కోసం ఆగష్టు మొదటి వారంలో ప్రభాస్ సెట్స్ లోకి వెళతాడు. అయితే ప్రభాస్ మరో మూవీ ని హను రాఘవపూడి దర్శకత్వంలో సెప్టెంబర్లో మొదలు పెడతారని అన్నారు, అదే ప్రచారం జరుగుతుంది. తాజాగా ప్రభాస్-హను రాఘవపూడి కాంబో కి ముహూర్తం సెట్ అయినట్లుగా తెలుస్తోంది.
అది శ్రావణమాసం ఆగస్టు 17 శనివారం ప్రభాస్-హను రాఘవపూడి చిత్రం పూజ కార్యక్రమాలతో మొదలు పెడుతున్నారట. అయితే ఆగస్టు 17 న పూజ కార్యక్రమాలతో మొదలపెట్టినప్పటికీ.. ప్రభాస్-హను మూవీ సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూట్ కి వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈచిత్రంలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ ని అనుకుంటున్నారు. ఈ చిత్రం లో ప్రభాస్ సోల్జర్ గా కనిపించబోతున్నారని టాక్.