జగన్ మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో ఓడిపోయాక తాడేపల్లి, పులివెందుల కన్నా ఎక్కువగా బెంగుళూరు ప్యాలెస్ లోనే ఉంటున్నాడు. ఏపీ ఎన్నికల్లో వైసీపీ కి ప్రతిపక్ష హోదా దక్కనటువంటి దారుణమైన ఓటమితో జగన్ మోహన్ రెడ్డి ని సొంత నేతలే విమర్శించడం మింగుడుపడని విషయం. మరోపక్క తాను పెంచి పోషించిన మీడియా కూడా తనని పదేపదే విమర్శిస్తూ వస్తోంది.
ఇక ఈమధ్యన జగన్ మీడియాలో హైలెట్ అయ్యేందుకు తాపత్రయపడుతున్నారు. అందుకే వినుకొండ హత్యని రాజకీయ హత్యగా మార్చి అసెంబ్లీలో అడుగుపెట్టకుండా ప్లాన్ చేసుకున్నాడు. లేదంటే అసెంబ్లీలో అధికార పార్టీ తనని విమర్శిస్తుంటే చూడడం కష్టం కదా.. ఆ తర్వాత ఢిల్లీ పోయి ఏపీలో అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయంటూ ధర్నా చేసి వచ్చాక ఈరోజు అధికార పక్షం ఆరోపిస్తున్నట్టుగా తామేమి తప్పులు చెయ్యలేదు అంటూ మీడియా సమావేశం ఏర్పాటు చేసాడు జగన్.
ఇక ప్రస్తుతం తాను పోరాడాల్సిన పనేమీ లేదు అనుకున్నాడో ఏమో జగన్ మళ్ళి బెంగుళూరు ప్యాలెస్ కి పయనమయ్యాడు అని తెలుస్తుంది. ఓడిపోయాక జగన్ ఎక్కువగా బెంగుళూర్ ప్యాలెస్ కే పోతున్నాడు. అక్కడే అయితే కాస్త మనశాంతిగా ఉంటుంది అనుకుంటున్నాడేమో.. అదే తాడేపల్లి లో ఉంటే ఎవరో ఒకరు కలుస్తూ ఉంటారు.
బెంగుళూరు అయితే ప్రశాంతగా ఉండొచ్చని జగన్ ఆ డెసిషన్ తీసుకున్నాడో, లేదంటే అక్కడ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ తో మంతనాలు గట్రా చేస్తాడో, కాదు గతంలోలా హైదరాబాద్ వెళితే చెల్లిని చూడాల్సి వస్తుంది అని భయపడుతున్నాడా అంటూ నెటిజెన్స్ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.