పెద్ద సినిమాలకి టికెట్స్ పెంచుకునే వెసులుబాట్లు చాలాసార్లు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. భారీ బడ్జెట్ మూవీస్ వస్తున్నాయంటే నిర్మాతలు ఆయా రాష్ట్రాల సీఎం ల ముందు వాలిపోయి టికెట్ రేట్లు పెంచుకునేందుకు, స్పెషల్ షోస్ కి అనుమతుల కోసం అడగడము, సినిమా ఇండస్ట్రీతో మంచి ర్యాపొ కోసం ఆయా ప్రభుత్వాలు రేట్లు పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చేస్తున్నాయి.
వీటి వల్ల మిడిల్ క్లాస్ పీపుల్ పై పెను భారం పడుతుంది. ఇంట్లో ఉన్న నలుగురు సినిమాకి వెళ్లాలంటే ఓ రెండు వేలు జేబులో వేసుకోవాల్సి వస్తుంది. అందుకే వారు తెగించి థియేటర్స్ వైపు కదలడం తగ్గించేశారు. తాజాగా కల్కి 2898 AD విషయంలో మేకర్స్ అడగడం రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతులు ఇవ్వడం జరిగింది. అయితే కల్కి ఓపెనింగ్స్ విషయంలో కాస్త తడబడడానికి కారణం కల్కికి పెరిగిన టికెట్ రేట్లు కూడా ఓ కారణమనే మాట వినిపించింది.
అసలే నెలాఖరు రోజులు, ఇంకేం వెళతారు సినిమాకు. అందుకే కల్కి ఓపెనింగ్స్ పై టికెట్ రేట్ల పెంపు ఎఫెక్ట్ కూడా పడే ఉంటుంది అన్నారు. అందుకేనేమో కల్కి మేకర్స్ ఇప్పుడు డ్యామేజ్ ని సరిచేసుకోవడానికి రెడీ అయ్యారు. కల్కి మండే పెరఫార్మెన్స్ ని బట్టి టికెట్ రెట్లని తగ్గించేలా ప్లాన్ చేసుకుంటున్నారట. సోమవారం ఆక్యుపెన్సీ బావుంటే ఓకె లేదంటే పెరిగిన టికెట్ రెట్లని కల్కి మేకర్స్ తగ్గిస్తారన్నమాట.