కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఈమధ్యన ఎక్కువగా సినిమాలు చేస్తున్నట్టుగా కనిపించడం లేదు. ఆమె తరచూ ఫ్యామిలీ తో స్పెండ్ చేస్తున్న పిక్స్ ని షేర్ చేస్తున్నది. భర్త విగ్నేష్, కవల పిల్లలతో నయనతార సమయాన్ని గడుపుతూ కాలక్షేపం చేస్తుంది. సౌత్ లో అత్యధిక పారితోషకం తీసుకునే నయనతార ఎలాంటి కేరెక్టర్స్ లోకయినా పరకాయ ప్రవేశం చేస్తుంది.
కర్తవ్యం లాంటి సీరియస్ సినిమా అయినా, రొమాంటిక్ మూవీ అయినా, జవాన్ లాంటి చిత్రమైన తన కేరెక్టర్ విషయంలో నయనతార అద్భుతాలు చేసి చూపిస్తుంది. అందుకే ఆమెకి సౌత్ లో విపరీతమైన క్రేజ్. నాలుగు పదుల వయసు దాటినా నటన కానివ్వండి, గ్లామర్ కానివ్వండి అణువంతైనా తగ్గలేదు.
ఇప్పటికి యూత్ ని తన చుటూ తిప్పుకునే లాంటి గ్లామర్ షో ఆమె సొంతం. తాజాగా బ్లాక్ ట్రాన్స్పరెంట్ శారీ లో నయనతార అద్దరగొట్టేసింది. సింప్లి సూపర్బ్ అనేలా నయనతార శారీ లుక్ ఉంది. ఆమె ఓ సినిమా ఈవెంట్ లో పాల్గొనగా అక్కడ తీసిన ఈ పిక్ ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారింది.