Advertisementt

దర్శన్ కి టాలీవుడ్ హీరో షాకింగ్ సపోర్ట్

Fri 28th Jun 2024 11:05 AM
naga shourya  దర్శన్ కి టాలీవుడ్ హీరో షాకింగ్ సపోర్ట్
Shocking: Tollywood Star supports Darshan దర్శన్ కి టాలీవుడ్ హీరో షాకింగ్ సపోర్ట్
Advertisement
Ads by CJ

కన్నడ హీరో దర్శన్ తన అభిమానిని అత్యంత దారుణంగా హత్య చేయించిన నేరానికి గాను గత 20 రోజులుగా జైలు జీవితం గడుపుతున్నాడు. దర్శన్ అభిమాని రేణుక స్వామి తన ప్రేయసి పవిత్ర గౌడ్ కి అసభ్యకరమైన మెసేజెస్ పంపించిన కారణముగా కిరాయి గుండాలతో హత్య చేయించిన దర్శన్ తో సహా ఈ కేసు లో 17మంది జైలు పాలయ్యారు. ఈ కేసులో రోజుకో విషయం వెలుగులోకి వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. 

సోషల్ మీడియాలో దర్శన్ పై దండెత్తని నెటిజెన్ లేడు, దర్శన్ కి సపోర్ట్ గా ఏ ఒక్కరూ నిలబడడం లేదు. అందరూ దర్శన్ ని అస్సహించుకుంటున్నారు. కానీ ఇప్పుడొక తెలుగు హీరో దర్శన్ కి సపోర్ట్ చేస్తూ పెట్టిన పోస్ట్ కి అందరూ షాకవుతున్నారు. సంఘటన జరిగిన 20 రోజులకి స్పందించడమే షాక్ అనుకుంటే.. దర్శన్ అన్న తప్పు చేయడు అంటూ సర్టిఫికెట్ ఇవ్వడం నెటిజెన్స్ ని మరింత ఆగ్రహానికి గురి చేసింది. 

టాలీవుడ్ హీరో నాగ శౌర్య దర్శన్ కి ససోర్ట్ గా నిలుస్తూ.. చనిపోయిన రేణుక స్వామికి నా ప్రగాఢ సానుభూతి, ఈ కేసులో అప్పుడే దర్శన్ అన్నే తప్పు చేసాడనే అభిప్రాయానికి రావడం నాకు నచ్చలేదు, ఆయన ఎవ్వరికి ఏ హాని చెయ్యరు, దర్శన్ అన్న గురించి తెలిసిన వారెవరూ అతను తప్పు చేసాడంటే నమ్మరు. 

ఆయన చాలామంచి వాడు, ఆ విషయం ఆయనతో పరిచయమున్న ప్రతి వ్యక్తి చెబుతారు, చాలామందికి కష్ట కాలంలో ఆయన తోడున్నాడు. నేను ఈ వార్తని అసలు నమ్మలేకపోతున్నాను, ఈ కేసు వల్ల అన్న ఫ్యామిలీ కూడా సఫర్ అవుతుంది అని తెలుసుకోవాలి, వాళ్ళకి ఈ సమయంలో కాస్త ప్రైవసి  కావాలి. 

అన్న మీపై నమ్మకం ఉంది, ఈ న్యాయ వ్యవస్థ పై నమ్మకముంది, మీరు అమాయకుడు అని తేలిపోతుంది. అసలు నేరస్తులు ఎవరు అనేది బయటపడుతుంది అంటూ దర్శన్ కి సపోర్ట్ గా నాగ శౌర్య చేసిన పోస్ట్ పలు విమర్శలకు తావిచ్చింది. అందరూ తప్పు అంటుంటే.. నాగ శౌర్య అలా సపోర్ట్ చేయడమేమిటి అంటూ నెటిజెన్స్ ఫైర్ అవుతున్నారు.   

Shocking: Tollywood Star supports Darshan:

Naga Shourya supports key accused Darshan

Tags:   NAGA SHOURYA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ