Advertisementt

దర్శకధీరుడు రాజ‌మౌళికి అరుదైన గౌర‌వం

Wed 26th Jun 2024 02:42 PM
rajamouli  దర్శకధీరుడు రాజ‌మౌళికి అరుదైన గౌర‌వం
Rajamouli gets a rare honor దర్శకధీరుడు రాజ‌మౌళికి అరుదైన గౌర‌వం
Advertisement
Ads by CJ

గత ఏడాది ఆర్.ఆర్.ఆర్ కోసం ఆస్కార్ వేడుకకి వెళ్లిన రాజమౌళి దంపతులకు ఇప్పుడు అరుదైన గౌరవం దక్కింది. దర్శకధీరుడు రాజమౌళి, ఆయన భార్య రమా రాజమౌళిలకు ఆస్కార్ అకాడెమీలో చేరడానికి ఆహ్వానం లభించింది. ఆస్కార్ అవార్డులు అంద‌జేసే అకాడ‌మీలో రాజమౌళి, ర‌మా రాజ‌మౌళి, హిందీ న‌టి ష‌బానా అజ్మీల‌కు స‌భ్య‌త్వ ఆహ్వానం అందింది. 

అకాడ‌మీ ఆఫ్ మోష‌న్ పిక్చ‌ర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ తాజాగా సుమారు 487 మంది కొత్త స‌భ్యుల‌కు ఆహ్వానం పంపింది. అందులో రాజ‌మౌళి, ష‌బానా అజ్మీ, రమా రాజ‌మౌళి, రితేశ్ సిద్వానీ లకు ఆస్కార్ అవార్డులు అంద‌జేసే అకాడ‌మీలో స‌భ్య‌త్వ ఆహ్వానం అందింది.  

డైరెక్టర్స్ జాబితాలో రాజమౌళిని ఆహ్వానిస్తూ.. ఆర్ఆర్ఆర్, ఈగ సినిమాలను రాజమౌళి డైరెక్ట్ చేసినట్లు చెప్పారు. అలాగే కాస్ట్యూమ్స్ విభాగంలో పని చేసిన రామ రాజమౌళి గురించి చెబుతూ ఆమె ఆర్ఆర్ఆర్, బాహుబలి ది బిగినింగ్ మూవీకి పని చేసినట్లుగా చూపించారు. ఇది రాజమౌళి దంపతులకు లభించిన అరుదైన అవకాశమే కాదు.. అరుదైన గౌరవం కూడా అని ప్రతి తెలుగు వాడు మాట్లాడుతున్నారు. 

Rajamouli gets a rare honor:

Rajamouli and his wife enter Oscars Academy

Tags:   RAJAMOULI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ